కరోనా సమయంలో అన్ని దేశాలు సమన్వయాన్ని పాటిస్తూ.. ఒకరికి ఒకరు సహాయంగా ఉండవలసింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం.. లాక్‌డౌన్ నేపధ్యంలో చాలా చోట్ల వలస కార్మికులు నిలిచిపోయారు.. వారందరికి చేయుతనిచ్చి ఆదుకోవడం ఆయా దేశ, రాష్ట్రాల ప్రభుత్వానిది.. కానీ మలేషియా ప్రభుత్వం అక్రమంగా నివసిస్తున్న వలసకార్మికుల, శరణార్థుల విషయంలో తీసుకున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అదేమంటే కరోనా వైరస్ కట్టడికి అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపధ్యంలో మలేషియా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధనలు సడలించనున్నట్లు ప్రకటించింది.

 

 

ఈ ప్రకటన జారీ చేసిన గంటల వ్యవధిలోనే అక్కడ అక్రమంగా నివసిస్తున్న వలస కార్మికులు, శరణార్థులపై ప్రభుత్వం కన్నెర్ర చేసి దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను, శరణార్థులను అరెస్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించింది.. దీంతో కౌలాలంపూర్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న వేలాది అక్రమ వలసదారులను, శరణార్థులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అందులో దాదాపు 900 మంది భారత పౌరులను భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా వీరిలో 250 మంది వరకు తెలుగువారు ఉన్నారని సమాచారం. ఇక్కడుంటున్న వారిలో కొందరు వీసా రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అయితే లాక్‌డౌన్ వల్ల ఇమ్మిగ్రేషన్ కార్యకలాపాలు కూడా నిలిచిపోవడంతో.. వారి వీసాలు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తుంది..

 

 

ఇకపోతే ఇదే సమస్య అమెరికాలో కూడా తలెత్తింది.. అయితే విదేశీయులకు సంబంధించిన వీసాల విషయంలో 60 రోజుల గడువును ఇచ్చింది అమెరికా. ఇక ఇదే బాటలో మరికొన్ని దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. కానీ మలేషియా మాత్రం వలసదారుల విషయంలో ఇలా కఠినంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజంగా బుద్ధిలేని ప్రభుత్వం ఈ సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని నెటిజన్స్ విమర్శిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: