లోకంలో కరోనా వచ్చిన బాధకంటే మద్యం దొరకడం లేదనే బాధ మద్యం ప్రియులను పట్టి పీడుస్తున్నట్లుగా ఉంది.. ఇన్ని రోజుల నుండి మద్యం గొంతులోకి దిగని తాగుబోతుల కళ్లు ఎప్పుడెప్పుడు సర్కార్ గుడ్ న్యూస్ చెబుతుందా అని గుమ్మం ముందు నిలబడి చేతిలో సంచిని పట్టుకుని ఆశతో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో మద్యం అమ్మకాలకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో.. తెలంగాణాలో కూడా త్వరగా ప్రకటిస్తే బాగుండునని ఊవ్విళ్లూ ఊరుతున్నారు మందు బాబులు..

 

 

ఇకపోతే కేంద్రం సూచించిన విధంగా సోమవారం నుంచి వైన్స్ షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా.. వద్దా.. అన్న విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇక లాక్ డౌన్ 2.0 నేటితో ముగియనున్న నేపధ్యంలో.. తెలంగాణలో ఇంకా సడలింపు లేదన్న విషయం తెలిసిందే.. అంతలోనే మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేస్తూనే, వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. ఇంతవరకూ నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్న ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులు లభించాయి.

 

 

ఇదిలా ఉండగా  కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించారు. ఈరోజు కూడా మరికొందరితో చర్చించి, నిఘా వర్గాల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది.

 

 

ఈరోజు రాత్రివరకు మద్యం విక్రయాల విషయంలో తుది నిర్ణయాన్ని వెల్లడించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమ అవుతుందని తెలుస్తుంది.. కాబట్టి చుక్కకోసం ఎదురుచూస్తున్న మందు ప్రేమికుల్లారా ఇంకా కొన్ని గంటల్లో మీ గొంతులకు తీపికబురు అందబోతుంది.. అప్పటివరకు ఆశతో గడపండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: