మాట్లాడే మాటల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు అంటారు. ఇప్పుడు వైసిపి సీనియర్ నాయకుడు విజయ సాయి రెడ్డి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేదలు, గిరిజనులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోంగార్డులు పాత్రికేయులకు సైతం నిత్యావసర సరుకులు అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు. ఒడిషా సరిహద్దులో ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు విజయ సాయి రెడ్డి తన ట్రస్టు ద్వారా అండగా నిలిచి వారికి ఆకలి తీరుస్తున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలలో పేదలు, గిరిజనులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోంగార్డులు పాత్రికేయులకు విజయ సాయి రెడ్డి తన ట్రస్టు ద్వారా  ఉచితంగా నిత్యావసర సరుకులు అందించారు.

 

విశాఖపట్టణంలో ఇతర రాష్ట్రాలకు చిక్కుకుపోయిన వారికి భోజన సదుపాయం కల్పించారు. విశాఖపట్టణంలో 7,500 మంది పారిశుద్ధ్య కార్మికుల కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయసాయిరెడ్డి 15వేల మంది వాలంటీర్లకు శానిటైజర్లు తన ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. విశాఖలో కరోనా వేళ కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి తన ట్రస్ట్ ద్వారా వెయ్యి రూపాయల విలువైన నిత్యవసర సరుకులు అందించారు.

 

అలాగే ఉత్తరాంధ్రలో చాలా వరకు లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి పేద ప్రజలకు తన ట్రస్టు ద్వారా విజయసాయిరెడ్డి ఆదుకున్నాడు. అంతేకాకుండా పార్టీ క్యాడర్ కి కూడా విజయ్ సాయి రెడ్డి తన అప్పన్న హస్తం తన ట్రస్ట్ ద్వారా అందించినట్లు సమాచారం. మరోపక్క తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను సీఎం జగన్ ఆదుకుంటున్నారని ఆయన బాటలోనే మేము కూడా నడుస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ విపత్కర మైన సమయంలో ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి చేసిన పనులు టాప్ అని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: