గబ్బిలాలు అంటేనే భయం చాలామందికి. చీకట్లో గబ్బిలాయిలా అంటూ చెడిపోయిన వారికి  తిట్లూ శాపనార్ధాలు పెట్టే పెద్దవాళ్ళూ ఉన్నారు. గబ్బిలం అంటేనే అపశకునమని, అభివ్రుధ్ధికి విఘాతం అని అంటారు. ఇక గబ్బిలాల మీద భారతీయలతో పాటు ప్రపంచంలో చాలా దేశాలకు విముఖత ఉన్నా చైనీయులకు మాత్రం అది మంచి ఫూడ్. ఇక తాజాగా కరోనా వైరస్ వీర విహారం చేసిన సమయంలో గబ్బిలాల ద్వారానే అది వచ్చిందన్న సంగతి బయటపడింది. దాంతో ప్రపంచం మొత్తం గబ్బిలాలు అంటే భయపడుతోంది. 

 

అటువంటి గబ్బిలాలను భారత్ లో కూడా కొన్ని చోట్ల  కొన్ని జాతులు తింటున్నాయి అంటే అది వింతే కాదు, భయంగా కూడా ఉందిట. గబ్బిలాల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని ఓ వైపు భారతీయ పరిశోధకులు శోధించి మరీ  చెబుతున్నారు. అటువంటి సమయంలో గబ్బిలాలను తింటే చైనా మాదిరిగానే కరోనా భారత్ కి కూడా చీడలా పట్టుకుందని భయపడుతున్నవారు కోట్లలో ఉన్నారు.

 

ఇంతకీ భారత్ లో గబ్బిలాలు తినే వారు ఎక్కడ ఉంటారన్న ప్రశ్నకు జవాబు నాగాలాండ్ గా చెప్పాలి. నాగాలాండ్ లోకి  మిమి అనే గ్రామంలో కొండ గుహలో ఉండే కొన్ని తెగల వారు గబ్బిలాలను  వేటాడి తీసుకువస్తారు. ప్రతీ ఏటా అక్టోబర్ లో జరిగే పండుగ రోజున వాటిని కోసి మాంసం వండుకుని తింటారట. ఈ వేడుక చూసేందుకు వచ్చిన వారికి కూడా ఈ గబ్బిలం మాంసాన్నే ఆహారంగా ఇస్తారట. 

 

ఇక వీరంతా గబ్బిలాలు బలవర్ధకమైన ఆహారమని నమ్ముతారుట.  గబ్బిలాల్లో ఉండే ఔషధ గుణాలు తమను ఆరోగ్యంగా ఉంచుతాయని కూడా నమ్ముతారుట. ఇక గబ్బిలాల ఎముకలను పొడిగా చేసి వాటిని రకరకాల ఔషధలాల్లో వినియోగిస్తారు. మొత్తానికి చూసుకుంటే చైనా మాదిరిగా ఇక్కడ కూడా గబ్బిలాలు తింటున్నారు. మరి కరోనా మహమ్మారి దేశంలో ఉన్న‌ వేళ వీరిని  ఎలా కట్టడి చేసి దారికి తేవాలో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: