విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. భారత్ కు ఇది కొత్త విషయమేమీ కాదు. ఇలాంటి ఆపరేషన్లు దాదాపు 30సార్లు నిర్వహించి అందులో విజయాన్ని సాధించింది. అప్పుడంతా ఒక ఎత్తు.. ఇపుడు మరో ఎత్తు. ఇది అంత సులువేమీ కాదు. చాలా క్లిష్టమైనది. ఎందుంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ కు మనవాళ్లను రప్పించడం అంటే కత్తిమీద సాములాంటిదే. 

 

విదేశాల్లో మన భారతీయులకు ఏమాత్రం ఆపద పొంచి ఉందని తెలిసినా.. భారత ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. వాళ్లను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ఎన్నోసార్లు అలాంటి బాధ్యతలను తనపై వేసుకొని విపత్కర పరిస్థితుల నుంచి మనవాళ్లను కాపాడింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తోంది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే భారత ప్రభుత్వం అరుదైన చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. 

 

లక్షలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే పెద్ద ఆపరేషన్ ఇదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి చెందిన మూడున్నర లక్షల మంది ప్రసాస భారతీయులు స్వదేశానికి రావాలనుకుంటున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే ప్రకటించారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు.. తెలంగాణ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నేతలు సైతం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. విదేశాల్లో చిక్కుకున్న తమ ప్రాంతాల వాళ్లను తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్బంలో ప్రవాస భారతీయుల తరలింపు చేపట్టడానికి భారీ కసరత్తే చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పౌర విమానాలు, నౌకలను అద్దెకు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 

 

గల్ఫ్‌ దేశాలకు తోడు అమెరికా, బ్రిటన్‌, ఉక్రెయిన్‌ వంటి దేశాల నుంచి ప్రవాస భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు.. వైమానిక, నౌకా దళాలు సిద్ధంగా ఉన్నాయి.  భారత వైమానిక దళానికి చెందిన భారీ రవాణా విమానాలు 'సి-17 గ్లోబ్‌ మాస్టర్‌'లను ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: