చిన్న పిల్ల‌లు చ‌దువుకునే వ‌య‌సులో ముదు ముద్దుగా బొమ్మ‌లు వేయ‌డం స‌హ‌జం. అయితే చాలా మంది పిల్ల‌లు ఏవేవో ఇల్లు, ఐస్‌క్రీమ్‌, చిలుక‌లు ఇలా ర‌క ర‌కాల బొమ్మ‌లు వేస్తుంటారు. కాని నాలుగేళ్ల వ‌య‌సులో అనుజిత్ ది  కేర‌ళ‌లోని తిస్సుర్ చిన్న వ‌య‌సులోనే పెన్ను, పేపర్‌, క్రేయాన్స్‌ అందుకొని రకరకాల బొమ్మలు గీసేవాడు. తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి వాటినే అందమైన బొమ్మలుగా మలిచేవాడు. అలా అనుజత్ వాళ్ళ అమ్మ సింధు అతడి  ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. ఆర్డ్‌ డిజైనర్‌ అయిన వాళ్ల నాన్న విన్యావల్‌ కూడా ఆ కుర్రాడిని ఎంత‌గానో మెచ్చుకునేవారు. ‘‘ఒక రోజు స్కూల్లో టీచర్ మీకు నచ్చిన బొమ్మ వేసి చూపించమన్నారు. అప్పుడు  రిక్షా బొమ్మ వేశాడు. అది అందరికి బాగా నచ్చింది. ఆ రోజు నుంచి దగ్గర్లో ఎక్కడ డ్రాయింగ్ కాంపిటేష‌న్స్  జరిగినా వాళ్ళ స్కూల్  తరఫు నుంచి అనుజత్ వెళ్ళేవాడు. 

 

ఓసారి అలా కాంపిటేష‌న్‌లో బావిలో నుంచి నీళ్లు తోడుతున్న అమ్మ... వంట చేస్తున్న అమ్మ... బట్టలు ఉతుకుతున్న అమ్మ... అంట్లు తోముతున్న అమ్మ... రోజంతా అమ్మ పడే కష్టాన్ని కాన్వాసు పై బొమ్మలుగా వేశాడా. ‘మా అమ్మ, ఇరుగుపొరుగు అమ్మలు’ పేరుతో గీసిన బొమ్మ అతడికి ఏకంగా అంతర్జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అంతేకాదు... కేరళ ప్రభుత్వం ఏకంగా అతడి బొమ్మను లింగవివక్షను అధిగమించేందుకు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా గుర్తించడం అనేది విశేషం. కేరళకు చెందిన అనుజత్‌ (14) రంగుల ప్రపంచంలోకి ఒకసారి అడుగిడితే... 

 

త‌ల్లిదండ్రులిద్ద‌రూ  ప్రోత్సహించ‌డంతో అనుజత్‌ రంగుల ప్రయాణం వేగం అందుకుంది. అయితే అతడిని డ్రాయింగ్ కాంపిటేష‌న్ల‌కు పంపేవారు కాదు. బొమ్మలు గీయడంలో ఆనందం ఉంటుంది కానీ పోటీలకు వెళ్లడంలో కాదని వారు భావించడమే అందుకు కారణం. అనుజత్‌ తన కోసం ఒక బొమ్మ గీయాలనే ఆలోచనతో మూడేళ్లు విరామం తీసుకున్నాడు. అదే సమయంలో ప్రముఖ కార్టూనిస్ట్‌ శంకర్‌ పిళ్లై జ్ఞాపకార్థం ‘శంకర్‌ అకాడమీ’ అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తోందని తెలిసింది. అనుజత్‌ మూడేళ్ల క్రితం గీసిన బొమ్మను వాళ్ల నాన్న ఆ పోటీలకు పంపించారు. అందులో అనుజత్‌ వేసిన బొమ్మ బహుమతికి ఎంపికైందని తెలిసి వాళ్లమ్మ ఎంతో సంతోషించింది. కానీ విషాదమేమిటంటే... అనుజత్‌ ఆ అవార్డ్‌, సర్టిఫికెట్‌ అందుకునే సమయానికి ఆమె గుండె సంబంధవ్యాధితో చనిపోయింది. ‘‘మా అమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది. ప్రతి పెయింటింగ్‌ ఇంతకుముందు వేసిన దాని కన్నా బాగా వేయాలని ఎప్పుడూ చెబుతుండేది. అమ్మకు నామీదున్న నమ్మకం, నాన్న సహకారంతో చదువు పూర్తవగానే ఆర్ట్‌ను వృత్తిగా కొనసాగించాలనుకుంటున్నా’’ అని చెప్పాడు అనుజిత్ ఈ విచార‌క‌ర క‌థ వింటే ఎవ‌రిక‌న్నా క‌న్నీళ్ళు రావ‌ల‌సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: