కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. ఈ వైరస్ కి వ్యాక్సిన్ మరియు డ్రగ్ లేకపోవటంతో నివారణ ఒక్కటే మార్గం అయింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా చాలావరకు దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ పరిణామంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయాయి. ప్రపంచంలో ధనిక దేశాలు మరియు అగ్రరాజ్యాలు అనుకునేవి ఈ కరోనా వైరస్ వల్ల అడ్రస్ లేకుండా పోయాయి.

 

భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. దీంతో ఇటీవల మోడీ సర్కార్ లాక్ డౌన్ మే 17వరకు పొడిగించడం జరిగింది. ముఖ్యంగా ఈ వైరస్ గుంపులుగుంపులుగా ఉండే చోట మరియు చల్లని ప్రదేశాలలో ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తప్పనిసరిగా ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని రూల్స్ ఇప్పటికే పాస్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం సరికొత్త బైక్ ఒకరు సృష్టించడం జరిగింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే త్రిపురలో 39 సంవత్సరాల పార్థా సాహా అనే బైక్ మెకానిక్ బ్యాటరీ సాయంతో నడిచే మోటార్ సైకిల్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడీ ఈ బైక్ ద్వారా నేను నా కూతురు సురక్షిత దూరం మెయింటేన్(భౌతిక దూరం) చేస్తూ ప్రయాణం చేస్తున్నామని సాహా చెప్పాడు. అసలు బైక్ మీద కూర్చున్న ఒకరికి ఒకరు చాలా డిస్టెన్స్ ఉండటంతో ఈ బైక్ చూసి ఆ ఊరి వారు తెగ ఆశ్చర్యపోతున్నారు. బ్యాటరీతో నడిచే ఈ బైక్ గంటకు 40 కిలోమీటర్లు వెళ్తుంది. పూర్తి బ్యాటరీ చార్జింగ్ కి మూడు గంటల టైం పడుతుంది. ఒక్కసారి ఫుల్ గా చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ కు రూ.10 ఖర్చు అవుతుంది. ఈ మెకానిక్ అద్భుత సృష్టిని అంతా ప్రశంసిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: