మారుతోన్న స‌మాజ జీవ‌న ప‌రిస్థితుల నేప‌థ్యంలో మాన‌వులు శృంగారాన్ని స‌రిగా ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నారు. అసలు ఇప్పుడు శృంగారాన్ని పూర్తిగా అనుభ‌వించే టైం కూడా చాలా మందికి ఉండ‌డం లేదు. ఈ ఉరుకు ప‌రుగుల జీవితంలో చాలా మంది డ‌బ్బు సంపాద‌న‌కే ప్ర‌యార్టీ ఇస్తున్నారు. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూస్తున్నారు. దీనికి తోడు ప‌ని ఒత్తిళ్లు... ఎక్కువ గంట‌లు ప‌ని చేయ‌డం.. స‌రైన ఆహారం తీసుకోక పోవ‌డం.. ప‌ట్ట‌ణాల్లో ఉండే కాలుష్యం లాంటివి అన్ని మాన‌వుడి శృంగార జీవితంపై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. 

 

దీంతో బ‌య‌ట ఐదంకెల జీతం సంపాదిస్తోన్న వారు సైతం ప‌డ‌క గ‌దిలో త‌ల వంచ‌క త‌ప్ప‌డం లేదు. త‌మ జీవిత భాగ‌స్వామిని స‌రిగా సంతృప్తి ప‌ర‌చ లేక‌పోతున్నారు. ఇది మ‌గ‌వాళ్ల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌దు.. ఆడ‌వాళ్లు కూడా శృంగారం విష‌యంలో ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. మ‌హిళ‌లు జంక్ ఫుడ్స్‌కు అల‌వాడు ప‌డ‌డంతో పాటు వారి ప‌ని ఒత్తిళ్ల వ‌ల్ల‌... పిల్లలు పుట్టాక వారి శీర‌ర ఆకృతిలో మార్పు రావ‌డంతో మ‌గ‌వాళ్లు వారితో శృంగారం చేసేందుకు (కొంద‌రు మాత్ర‌మే ) ఆస‌క్తి చూప‌డం లేదు. ఇక శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే వాటిలో పురుషుల‌కు ఎర్ర ద్రాక్ష చాలా ఉప‌యోగ క‌ర‌మైన‌వి అట‌. దీని వల్ల క‌ల‌యిక ఎక్కువ సేపు ఉంటుంద‌ట‌.

 

ఇత‌ర రంగు ద్రాక్ష‌ల క‌న్నా ఎరుపు రంగు ద్రాక్ష‌ల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయని తేల్చారు. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయట‌. దీనికి తోడు ఎక్కువ బ‌రువు ఉండేవారు... లావుగా ఉన్న వారు కూడా కాస్త బ‌రువు త‌గ్గుతార‌ట‌. అలాగే ఎరుపు ద్రాక్ష వ‌ల్ల కీళ్ల నొప్పుల‌తో పాటు హృద‌య సంబంధిత వ్యాధులు కూడా రావ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. ఇక శరీరంలో పేరుకు పోయిన కొవ్వు త‌గ్గ‌డంతో మ‌నుష్యులు యాక్టివ్ అయ్యేందుకు ఉపయోగ ప‌డుతుంది. ఇక ఎర్ర ద్రాక్ష వ‌ల్ల డ‌యాబెటిస్ త‌గ్గ‌డంతో పాటు కంటి చూపు కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: