అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలోని మ‌న వాళ్ల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఇలాంటి త‌రుణంలో ఆ దేశంలోని వారికి మ‌న రాజ‌కీయ పార్టీలు ఏం స‌హాయం చేస్తున్నాయే అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ త‌రుణంలో నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. ``ప్రపంచంలోని తెలుగువాళ్లు కరోనా కారణంగా ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకూడదు అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా పలు చర్యలు చేపట్టాం. కెనడాలో రెండు సిటీలు, అమెరికాలో దాదాపు 25 రాష్ట్రాల‌లో 45 సిిటీలలోని తెలుగు విద్యార్ధులు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. లాక్ డౌన్‌లో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఇక్కడి వాలంటీర్ వ్యవస్ధ స్పూర్తితో అమెరికాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు,మధ్దతుదారులను కలుపుకుని  ఈ 45 సిటీలలో చదువుతున్న తెలుగువిధ్యార్దులకు నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్దులకు పర్సనల్ గా ఫోన్ చేయడం వారికి కావాల్సినవి లిస్ట్ అవుట్ చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. మరికొందరికి 100 డాలర్ల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశాం. సహాయం అందుకున్న తెలుగు విద్యార్ధులు ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ని అభినందించారు.``అని ర‌త్నాక‌ర్ తెలిపారు.

 

అమెరికాలో సహాయం అందించే మరింతమందిని కలుపుకుని విద్యార్ధులకు కావాల్సిన నిత్యావ‌స‌రాలు పంపిణి కొనసాగుతోంద‌ని ర‌త్నాక‌ర్ అన్నారు. ``మా కమిటీలో కొందరు ఫార్మర్స్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పొట్టకూటి కోసం కువైట్ వెళ్లి వీసాలు, రిజిస్ర్టేషన్ల కోసం ఇబ్బంది పడుతున్న తెలుగువాళ్లను తక్షణం ఏపీకి చేర్చేవిధంగా అటు కువైట్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాయడం జరిగింది. రవాణా నిలిపివేయ‌డం వ‌ల్ల అమెరికాలో ఇరుక్కుపోయిన తెలుగువాళ్ళను ఇండియాకు తీసుకువచ్చేవిధంగా చేయాలని ఏపీ ఎన్ఆర్టి తరపున ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చాం. దానికి సీఎం వెంటనే స్పందించి విదేశీ వ్యవహారాలశాఖకు లెటర్ రాశారు. అమెరికాలో రవాణా బ్యాన్ కారణంగా ఉండిపోయిన తెలుగువాళ్లను ఇండియాకు చేర్పించే ప్రయత్నం చేయాలని కోరారు.ముఖ్యంగా వృధ్దులకు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు.`` అని వెల్ల‌డించారు.

 

``తెలుగుదేశం పార్టీనేతలు కరోనా నేపధ్యంలో కష్టాలు పడుతున్న ఇక్కడ ప్రజలకు గాని,అమెరికాలోని తెలుగు ప్రజలకు ఏమైనా సహాయ కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు ఎంతసేపటికీ వీడియో మీటింగ్ లు పెట్టుకుని పబ్లిసిటీకి వాడుకోవడం, కరోనాను నియంత్రించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లడం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలను మానుకుని ఈ సమయంలో ప్రజలను ఆదుకునే కార్యక్రమాలను చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెబుతున్నాను. లేదంటే టీడీపీ కనుమరుగవుతుంది.`` అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: