రోనా వల్ల సామాన్య ప్రజలకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో ప్రతరోజూవార్తల్లో చదువుతున్నాం.  అయితే లాక్ డౌన్ ముగిసే వరకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు.. మరో వైపు ఈ లాక్ డౌన్ వైరస్ పెరుగుదల కారణంగా పెంచుకుంటూ పోతున్నారు.  వాస్తవానికి నేటితో ముగియాల్సి ఉన్నా.. ఈ నెల 17 వరకు మళ్లీ పెంచారు.  తాజాగా ఓ మహిళ పురిటినొప్పులతో బాధపడుతూ 100 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్ లోని తిల్వానీ మొహల్లా ప్రాంతానికి చెందిన షాదా, జావెద్ లు భార్య భర్తలు. డెలివరీ కోసం షాదా షేర్ గండ్ లో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది.షాదా కు పురిటినొప్పులు మొదలయ్యాయి.

 

డెలివరీ కోసం  స్థానికంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు  చేసిన వైద్యులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచబాల్ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.  పాపం ఆ పురిటి నొప్పులతోనే వంద కిలోమీటర్లు ప్రయాణం చేసింది.   వంద కి.మీ. ప్రయాణించిన తర్వాత ఆరో ఆస్పత్రి లాల్ డెడ్ లో  బిడ్డకు జన్మ నిచ్చింది. డెలివరీ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అంతే ఆమె ఆనందం కాస్త ఆవిరైపోయింది.

 

 అప్పటి వరకు బాగానే ఉన్నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరోనా అని తెలియగానే వారి ఆవేదన అంతా ఇంతా కాదు.   అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు.  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్స్ ప్రకారం అత్యవసర చికిత్స చేయాలని, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రికి వైద్యులు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. షాదాకు కరోనా వైరస్ సోకడంతో లాడ్ డెడ్ ఆస్పత్రికి చెందిన 10మంది సిబ్బందితో పాటు, ఇద్దరు డాక్టర్లను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: