ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఈ దేశ ప్రజలు బాగా విశ్వాసం ఉంచుతారు. ఇష్టమైనా కష్టమైనా ఆయన చెబితే చాలు పంచుకుంటారు. 138 కోట్ల మంది భారతీయులను ఒక త్రాటి మీద తీసుకున్వచ్చిన ఘనత ఇప్పటికాలంలో ఒక్క మోడీ వల్లనే సాధ్యమైంది. మోడీ అంటే ఈ దేశంలోనే కాదు, ప్రపంచం కూడా ఆసక్తిగా చూస్తుంది.

 

కరోనా మహమ్మారి విషయంలో ఆయన తీసుకున్న స్పీడీ డెసిషన్స్ పట్ల అభివ్రుధ్ధి చెందిన దేశాలు కూడా అమితాశ్చర్యం కనబరచాయి. ఇంత పెద్ద దేశం, పేద దేశం కరోనా మహమ్మారిని తట్టుకుని ఎలా బయటపడుతుంది అని కూడా వారంతా చూశారు. అయితే అతి తక్కువ మరణాల రేటు దేశంలో నమోదు అయింది. దాంతో ఇతర దేశాలు కూడా ఇపుడు  మోడీ ఈజ్ రైట్ అంటున్నాయి.

 

మరి ఇంతటి పేరు సంపాదించుకున్న మోడీ కీలకమైన లాక్ డౌన్ మూడవ విడత కొనసాగించే సమయంలో ఎందుకు మీడియా ముందుకు రాలేదు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే విధంగా జాతిని ఉద్దేశించి ఆయన ఎందుకు భరోసా ఇవ్వలేదు అన్న మాట కూడా వస్తోంది. మోడీ మొదటి రెండు విడతల లాక్  డౌన్ సందర్భాల్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అదే విధంగా అంతకు ముందు జనతా కర్ఫ్యూ విషయంలో కూడా ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు.

 

ఇక ఆయన దేశం మొత్తం ప్రజలు ఏప్రిల్ 5న రాత్రి విద్యుద్దీపాలు ఆర్పేసి దీపాలు వెలిగించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ఆసేతుహిమాచలం చేతులు కలిపింది. అటువంటి మోడీ ఇపుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదన్న ప్రశ్న మాత్రం అందరిలో ఉంది. ఇక ఇప్పటికే నలభై రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ప్రజలు కూడా సహకరించారు.  దాన్ని మరో 14 రోజుల పాటు పాటించాలి అని మోడీ జాతి ముందుకు వచ్చి చెప్పడానికి ఎందుకు సందేహించారన్నది ఆలోచినాల్సిన విషయమే.

 

దీని మీద కాంగ్రెస్ నేత. లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు రంజన్ చౌదరి మోడీ మీద బాణాలు ఎక్కుపెట్టారు. మోడీ దేశానికి  ముఖం చాటేశారని ఆయన నిందించారు. అసలు 40 రోజుల లాక్ డౌన్ లో ఏం చేశారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలేంటి, మళ్ళీ కొనసాగించి  ఏం చేస్తారు. ఈ దేశంలో ప్రజలు, పేదలు అక్కరలేదా అంటూ విరుచుకుపడుతున్నారు.

 

మోడీ సర్కార్ కి  దేశ ఆర్ధిక  వ్యవస్థను గాడిలో పెట్టే  కార్యచరణ ఏదైనా  ఉందా అని కూడా ఆయన గట్టిగానే నిలదీస్తున్నారు.  చెప్పుకోవడానికి ప్రజలకు ఏదీ లేకనే ముఖం చాటేశారని ఆయన అంటున్నారు. అదే నిజమా. మోడీ అందుకేనా మీడియా ముందుకు రాలేదు అన్న ప్రశ్న ఇపుడు సామాన్యుడిలో కూడా ఉంది. మరి మోడీ మళ్ళీ జాతి ముందుకు వ‌చ్చి భరోసా ఇస్తేనే ఈ విమర్శలకు, డౌట్లకు చెక్ పడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: