ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెల రోజుల నుండి దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్  కొనసాగుతుంది. దీంతో మందుబాబుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వంలో లాక్ డౌన్  సడలింపు లు చేసిన విషయంలో తెలిసిందే. ఇందులో  భాగంగా రాష్ట్రంలోని ప్రాంతాలన్నింటిని  మూడు విభాగాలుగా విభజించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు వారీగా సడలింపులు నిర్ణయించింది  ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆరెంజ్ గ్రీన్ విభజించిన  ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్  సడలింపులలో  మార్గదర్శకాలను విడుదల చేసింది. 

 

 ఈ క్రమంలోనే గ్రీన్ జోన్ లలో   కార్యకలాపాలను పెంచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందు బాబుల నిరీక్షణ రేపటితో నెరవేరనున్నట్లు  తెలుస్తోంది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి మద్యం షాపులు ఓపెన్ కాకపోవడంతో మందు బాబుల నిరీక్షణ మామూలుగా లేదు. బ్లాక్  లో కొందామన్నా మద్యం దొరకని పరిస్థితి ఉండడంతో రోజురోజుకూ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇక రేపు మద్యం షాపులు ఓపెన్ కానుండటంతో... మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. 

 

 

 అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాల్లో మద్యం షాపులు తెరిచి ఉంటాయని స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా మద్యం షాపుల నిర్వహణ సమయాలను కూడా తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు. ఒకసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల్లో కి అనుమతి ఉంటుందని తెలిపిన ఆయన... సామాజిక దూరం మద్యం అమ్మకాలు జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: