ముందుచూపు ఆలోచించే విషయంలో వైయస్ జగన్ కి మించిన వారు మరొకరు లేరని చెప్పవచ్చు. వైరస్ కట్టడి చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది.రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ లాగా విడదీసిన కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుగా వైయస్ జగన్ మండలాల వారీగా మోడీకి తెలియజేయడం జరిగింది. మోడీ దాన్ని జిల్లాల వారీగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. చాలా వరకు కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారు అని విమర్శించిన నోళ్ళనూ ముగించేలా గా జగన్ పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సన్నద్ధం అవుతున్నారు. తాజాగా రాబోయే రోజుల్లో కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. 

 

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టడానికి వీలుగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సన్నద్దం అవుతున్నారు. ఇందుకుగాను గ్రామ సచివాలయం ఉపయోగించుకుంటున్నారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది.

 

కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మొత్తంమీద చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కరోనా వైరస్ కట్టడి చేయడంలో జగన్ కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: