కేంద్ర బృందం దేశంలో కరోన కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటన చేస్తోంది. ఈ మధ్యనే పొరుగు రాష్ట్రం తెలంగాణాలో అయిదు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించింది. అక్కడ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆరా తీసింది. తానే స్వయంగా  కేంద్ర బృందం పలు ప్రాంతాల్లొ పర్యటించి కరోనా కట్టడి  చర్యలపైన  రూడీ చేసుకుంది.

 

ఇపుడు ఏపీ వంతు. ఏపీలో  కేంద్ర బృందం పర్యటన సమయంలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారిగా 1600 దాకా పెరిగాయి. అయితే ఇవన్నీ కరోనా కేసులపైన  ర్యాపిడ్ టెస్టులు చేయడం వల్ల జరిగినది అని వైసీపీ సర్కార్ చెబుతోంది. మరో వైపు దేశంలోనే ఎక్కువగా లక్షా పదిహేను వేల జనాభాకు     టెస్టులు కరోనా విషయంలో చేశామని కూడా సర్కార్ పెద్దలు చెప్పుకుంటున్నారు.

 

అయినప్పటికీ మూడు జిల్లాలు ఇపుడు ఏపీని కలవరంపెడుతున్నాయి. కర్నూల్, క్రిష్ణా, గుంటూర్ జిల్లాలలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసులలో మూడవ వంతు ఇక్కడే నమోదు అవుతున్నాయి. ఇక ఏపీలో కరోనా కేసులు వైసీపీ సర్కార్ దాచిపెడుతోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

 

ఆ బండారం కేంద్ర  బృందం టూర్లో బయటపడుతుందని కూడా టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. తాము స్వయంగా  కేంద్ర బృందం సభ్యులను కలుస్తామని, వారికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి వివరిస్తామని కూడా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో  కేంద్ర బృందం టూర్ ఎలా సాగుతుంది. ఎవరికి బీపీ పెంచుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

 

నిజానికి ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ఉన్నా కూడా రాజకీయ దుమారం ఎక్కడా ఆగడంలేదు. అటు వైసీపీ, ఇటు టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక మొదట్లో కాస్త నెమ్మదించినా ఇపుడు ఏపీలో టీడీపీ దూకుడు మీద ఉంది. ర్యాపిడ్ కిట్స్ తో టెస్టులు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో  కేంద్ర బృందం అంతా బాగుందని కితాబు ఇస్తే పచ్చ పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ పడడం ఖాయం.

 

అలా కాకుండా కరోనా కట్టడి విషయంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే మాత్రం అది టీడీపీకి ఆయుధమే అవుతుంది. దాంతో  కేంద్ర బృందం టూర్ ఏపీలో పొలిటికల్ హీట్ ని పెంచుతోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: