దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంపై రచ్చ ఇప్పటిలో ఆగేలా లేదు. ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొన్నది. అయితే ఆ కొనుగోలులో అవకతవకలు జరిగాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పెద్ద హడావిడి చేసారు. కిట్లలో జగన్ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందని, ఆ విషయాన్ని తేల్చాలని గవర్నర్ కు కూడా లేఖ రాసారు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన కూడా కన్నా దీనిపై రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు.

 

ఇక కన్నా విషయాన్నే టీడీపీ నేతలు కూడా పట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నాని బాగా పైకి లేపుతూ..ఆయన చెప్పింది కరెక్ట్ అంటూ రాగాలు తీస్తున్నారు. తాజాగా కూడా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు..కన్నా లేఖలో కిట్లు కొనుగోలు ఎలా జరిగింది అనేది చాలా క్లారిటీగా ఉందని చెప్పారు. పనిలో పనిగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ్ముడుని కూడా ఈ వివాదంలోకి లాగారు. ఆయనకు ఏ విధంగా కిట్ల కొనుగోలులో లింక్ ఉందొ వివరించారు.  అసలు టెస్టింగ్ కిట్ల ఆర్డర్ విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం డైరక్టర్‌గా ఉన్న సాండర్స్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇచ్చారని చెప్పారు.

 

ఇక సుబ్రహ్మణ్యం, మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి సోదరుడు హరిహరనాథరెడ్డి ఇద్దరూ మెస్సర్స్ ఇన్వెసెంట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్స్‌గా ఉన్నారని, అందుకే  టెస్టింగ్ కిట్ల ఆర్డర్ ఇచ్చారన్నారు. ఈ విధంగా ఏదోరకంగా బుగ్గన తమ్ముడుకు లింక్ ఉందనే చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఈ విషయంపై బుగ్గన ఎప్పుడో స్పందించి...ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు. టీడీపీ, బీజేపీలు ఆరోపణలు చేస్తున్నాయి గానీ, వాటిని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కనపడుతుంది. మొత్తానికైతే ప్రతిపక్షాలు ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారాన్ని వదిలేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: