పరిస్థితి ఏదైనా, సమయం ఏదైనా కానీ టీడీపీకి మాత్రం రాజకీయమే కావాలి. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు అదే పనిలో బిజీగా ఉన్నారు. సమయం సందర్భం ఏమి ఉండదు..వారికి జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే కావాలి. ప్రస్తుతం కూడా కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా టీడీపీ నేతలు రాజకీయం చేయడం ఆపడం లేదు. హైదరాబాద్ లో ఉండి బాబు డైరక్షన్ చేయడం, ఇక్కడ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు.

 

అయితే తాము చేసే విమర్శల్లో అర్ధం ఉందా? ఇలాంటి సమయంలో రాజకీయం చేస్తే ప్రజలు అంగీకరిస్తారా? అనే విషయాన్నీ కూడా తెలుసుకోకుండా టీడీపీ నేతలు ఓ రేంజ్ లో జగన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా కూడా కరోనా అరికట్టడంలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. అసలు వైసీపీ నేతల వల్లే కరోనా పెరుగుతుందని, పాలన చేతకాకపోతే వెంటనే పగ్గాలు బాబుకు అప్పగించాలని తమ అధికార దాహాన్ని చూపిస్తున్నారు.

 

ఇక ఇక్కడ విషయం చెప్పుకోవాలి. కరోనా కట్టడిలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ తెలంగాణని ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకూ కేసులు తగ్గుతున్నాయని, కానీ ఏపీలో మాత్రం పెరుగుతున్నాయని ఎత్తి చూపిస్తున్నారు. నిజానికి టీడీపీ నేతలు చెప్పిందే జరుగుతుంది. తెలంగాణాలో తక్కువ కేసులు నమోదవుతుంటే, ఏపీలో ఎక్కువ వస్తున్నాయి. అయితే ఏపీలో కరోనా టెస్టులు ఎక్కువ చేస్తున్నారనే విషయం తెలిసిందే. దేశంలోనే ఎక్కువ టెస్టులు చేసేది ఏపీని.

 

ఇక తెలంగాణలో టెస్టులు సంఖ్య తక్కువ. అందుకే ఏపీలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ ఓ లాజిక్ మిస్ అవుతుంది. కేసులు తక్కువని తెలంగాణనే ఉదాహరణగా చూపిస్తుంది గానీ, ఏపీ కంటే రోజూ ఎక్కువ సంఖ్యలో కేసులు వచ్చే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలని చెప్పడం లేదు. ఇక దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో.

మరింత సమాచారం తెలుసుకోండి: