దేశంలోనే మొదటి కరోనా కేసు నమోదయిన కేరళలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ మహమ్మారి ని కేరళ సమర్ధవంతంగా ఎదుర్కొటుంది. గత నెల రోజుల నుండి ఏ రోజు కూడా అత్యధికంగా అక్కడ  20కి మించి కేసులు నమోదు కాలేదు. ఇక ఈ రోజు అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కాగా ఓ కరోనా బాధితుడు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 499 ఉండగా అందులో ప్రస్తుతం 95కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉన్నాయని అలాగే మొత్తం 401మంది కోలుకోగా ముగ్గురు మరణించారని  సీఎం విజయన్ వెల్లడించారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినా కూడా రేపటి నుండి లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేయడానికి  అక్కడి ప్రభుత్వం సుముఖత చూపించడం లేదు. ఆదివారాలు అయితే అన్ని జోన్లలో  పూర్తిగా షట్ డౌన్ కొనసాగుతుందని నిన్న సీఎం వెల్లడించారు. 
ఇక రేపటి నుండి మూడో దశ లాక్ డౌన్ ప్రారంభం కానుండగా ఈనెల 17వరకు కొనసాగనుంది. చాలా  రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మినహాయింపులను  అమలుపరచడానికి  రెడీ అవుతున్నాయి. మరో వైపు రోజు రోజుకు కేసుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు గత మూడు రోజుల నుండి దేశ వ్యాప్తంగా 2000కుపైగా కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: