దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కి కూడా కరోనా వైరస్ చెమటలు పట్టిస్తోంది. న్యాయవ్యవస్థను నమ్ముకున్నచాల మంది పరిస్థితి కరోనా కారణంగా ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఏర్పడింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేల మంది, దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల లో న్యాయవాదులు ఉన్నారు. న్యాయస్థానాలు నడవకపోతే వీళ్ళ బతుకు బండి నడవడం కష్టమే. న్యాయవాదులపై ఆధారపడిన జిరాక్స్ సెంటర్ పెట్టిన వాళ్ళు కూడా కరోనా  లాక్ డౌన్ కారణంగా తెగ మదనపడుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా కోలుకోలేమన్న స్థితిలోకి దేశం వెళ్లిపోయిందని ఆందోళన చెందుతున్నారు.

 

ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థ చాలా దీనస్థితి లోనే ఉందని చెప్పవచ్చు. కేసుల సంఖ్యకు అనుగుణంగా గానీ జనాభాకు అనుగుణంగా గాని న్యాయస్థానాలు దేశంలో ఏర్పాటు కాలేదు. అలాగే సౌకర్యాల కొరత ఎప్పటినుండో దేశాన్ని వెంటాడుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ న్యాయస్థానాలు కేసుల సంఖ్య తగ్గించుకోవటం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కింది కోర్టులో సాగించడం అంత సులువైన పని కాదు. వాది ప్రతివాదులు సాక్ష్యాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి కేసు విచారణ చేయించాలి.

 

కొన్ని కేసుల్లో తీవ్రత బట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రం సాధ్యం అయ్యే పని కాదు. వాళ్లు చూపించే సమర్పించే డాక్యుమెంట్స్ ఒరిజినలా, నకిలీవా తేల్చడం వీడియో కాల్స్ తో సాధ్యం అయ్యే పని కాదు. ఇటువంటి సమస్యలు కింది స్థాయి న్యాయస్థానాలకు చాలానే ఉన్నాయి. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ వల్ల సుప్రీంకోర్టు మాత్రమే కాదు దిగువ స్థాయి న్యాయస్థానాలకి కూడా కష్టాలు వచ్చాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: