జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి కన్ఫ్యూజన్ తోనే ప్రయాణిస్తున్నట్లు అర్థమవుతుంది. 2014 ఎన్నికల ముందు మార్చి నెలలో స్థాపించిన జనసేన పార్టీ, ఆ టైంలో చంద్రబాబు బిజెపితో కలసి కూటమిగా ఏర్పడి పవన్ మద్దతు ఇవ్వడం దిగింది. మొట్టమొదటిసారి పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా బిజెపి- టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ తన వంతు సహకారం అందించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది.

 

అయితే మొదటి నుండి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గమనిస్తే.. వైయస్ జగన్ ని టార్గెట్ గా చేసుకుని స్ట్రాటజీ లు వేయడం జరిగింది. 2019 లో జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా అను ఓడిపోయినా గాని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా జగన్ పార్టీని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే తనకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అండ కూడా తనకి ఉంటే రాజకీయంగా జగన్ ని బాగా ఇరుకున పెట్టవచ్చని.. బీజేపీ పార్టీ తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం జరిగింది.

 

అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. చాలా వరకు బీజేపీ పార్టీ పెద్దలు మరియు నాయకులు జగన్ తీసుకున్న నిర్ణయాలకు జై కొడుతున్నారు. కరోనా వైరస్ విషయంలో జోన్ లా వారీగా జగన్ ఫస్ట్ డివైడ్ చేసిన విధానాన్ని కేంద్రం ఇప్పుడు  అనుసరించటం జరిగింది. గుజరాత్ మత్స్యకారుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా బిజెపి నాయకులు జగన్ ప్రభుత్వాన్ని బాగా పొగడటం జరిగింది. అదేసమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తనని సంప్రదించకుండా బీజేపీ వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ మొత్తానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: