సమాజంలో కోపం అనేది ఎలా ఉందంటే ఒకరి జీవితాన్ని తొందర్లో నాశనం చేస్తుంది.. లేదా మరొకరి ప్రాణాలను కూడా తీసేస్తుంది.. అందుకే తన కోపమే తనకు భద్ర శత్రువు అని అంటారు పెద్దలు... సరిగ్గా ఇక్కడ కూడా ఓ అసంఘటిత సంఘటన వెలుగు చూసింది.. తమ కన్నా ఎక్కువ అన్నం తింటున్నారని మరో కూలీని దూషించడంతో అతని ప్రాణాలే పోయాయట..

 

 

వివరాల్లోకి వెళితే.. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వలసొచ్చారు. విభేదాలతో ప్రాణాలు తీసుకున్నారు. పనిలో చురుగ్గా లేవంటూ హేళన చేయడం.. మాకంటే ఎక్కువ తింటున్నావంటూ వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన కూలీ దారుణానికి ఒడిగట్టాడు. తోటికూలీలపై ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరుజిల్లాలో జరిగింది.


 

 

జీడిపప్పు ప్రాసెసింగ్ కంపెనీలో పని చేస్తున్నారు. అస్సాంలోని కరీంకంచ్ జిల్లాకు చెందిన సజాస్‌నాధ్(45), శంకర్ నాధ్ అలియాస్ బిశ్వనాధ్(25) రత్తపడి జిల్లాకు చెందిన నరేంద్ర పీస్నప్‌(25)ని ఏడిపిస్తుండేవారు. తమ కంటే ఎక్కువ తింటూ తక్కువ పనిచేస్తున్నావంటూ వేధింపులకు గురిచేసేవారు.వారి వేదింపులు మరీ ఎక్కువ కావడంతో అతను అందరికీ షాక్ ఇచ్చాడు..




 

 

ఆరు గంటలకే నిద్రలేచిన నరేంద్ర పక్కనే నిద్రపోతున్న సజాస్‌నాధ్, శంకర్‌నాధ్‌ తలపై ఇనుప రాడ్డుతో విచక్షనా రహితంగా దాడి చేశాడు. ఇద్దరినీ దారుణంగా కొట్టడంతో సజాస్‌నాధ్ స్పృహ‌ కోల్పోయాడు. శంకర్‌నాధ్ పెద్దగా కేకలు వేయడంతో మిగిలిన కూలీలు గమనించి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అందులో ఒకరు మరణించగా మరొకరిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరిలో నీ ఆసుపత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: