రోజు రోజు కు దేశంలో కరోనా కేసులు ఎక్కువతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు శనివారం రికార్డు స్థాయిలో 2600కుపైగా కేసులు నమోదు కాగా ఆదివారం ఆ రికార్డు బద్దలైయింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే  2700కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయని సమాచారం. అందులో ఎక్కువగా మహారాష్ట్ర లో 678, ఢిల్లీ 427, గుజరాత్ 374, పంజాబ్ 331తమిళనాడు 266,ఉత్తరప్రదేశ్ 158 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 41000 దాటగా 1300కు పైగా మరణించారు. మరోవైపు కరోనా ఉధృతి వున్న కూడా  మహారాష్ట్ర , ఢిల్లీ  లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడానికి  రెడీ అయిపోయాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే కరోనా తో కలిసి జీవించడానికి రెడీ అని లాక్ డౌన్ ఎత్తివేయడానికి సమయం వచ్చిందని వ్యాఖ్యానించాడు అయితే కొందరు కేజ్రీవాల్ తో ఏకీభవిస్తుంటే మరి కొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల పై మండిపడుతున్నారు. కాగా నేటి నుండి మూడో దశ లాక్ డౌన్ కొనసాగనుండగా ఈ లాక్ డౌన్ గడువు ముగియడానికి రెండు వారాలు సమయం వుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజుల నుండి కేసులు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే టెస్టులు ఎక్కువ చేస్తుండడం అభినందించాల్సిన విషయం అలాగే కరోనా ప్రభావం వున్నా కూడా మూడో లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన మినహాయింపులను అమలు చేయడానికి  సీఎం జగన్ గ్రీన్  సిగ్నల్ ఇచ్చారు. రేపు అక్కడ గ్రీన్ జోన్ల లో మద్యం షాపులు కూడా తెరుచుకోనున్నాయి అయితే ధరల విషయంలో మాత్రం మందుబాబులకు చుక్కలు కనిపించనున్నాయి. ఎందుకంటే మద్యం ధరలను 25 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి. మరోవైపు తెలంగాణ లో మాత్రం మద్యం విషయంలోనే కాదు కేంద్రం ఇచ్చిన ఏ సడలింపుల  అమలు పై క్లారిటీ లేదు. రేపు ఈ మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర కేబినెట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: