గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది

 

అలాగే ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1062 మంది చికిత్స పొందుతున్నారు. 488 మంది బాధితులు వైరస్ బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

 

వీటిలో ఒక్క కర్నూలు లోనే 30 కేసుల వరకు నమోదు కావడం గమనార్హం.  దీంతో ఏపీ లో కరోనా రాజధానిగా కర్నూలు అవతరిస్తోంది అనడంలో మాత్రం సందేహం లేదు.

 

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే -

అనంతపురంలో 7,

చిత్తూరులో 1,

గుంటూరులో 11,

కృష్ణ 8,

కర్నూలు 30,

నెల్లూరు 1

 

ఇక లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతీ ఒక్కరి వివరాలను నమోదు చేయాలని మరియు.... ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతిని కల్పించాలని ఆయన అన్నారు. వారికి కావాల్సిన మౌళిక వసతులు కూడా కల్పించాలని జగన్ తెలిపారు.

 

భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని.. క్వారంటైన్ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన అధికారులను హెచ్చరించారు. కనీసం లక్ష బెడ్లు అయినా సిద్ధం చేసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఇక వీరి కోసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలకు తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: