ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ ప్రపంచ దేశాలతో పాటు భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు విపరీతంగా కృషి చేస్తున్నాయి. దీని వ్యాప్తిని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరి కొద్ది కాలం ప్రాణాంతక వైరస్ తోనే మనం కలిసి జీవించాలని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏకంగా డబ్ల్యు.హెచ్. నే సెలవిచ్చింది.

 

వారు అలాంటి మాటలు అంటున్న సమయంలోనేకరోనా వైరస్ నుండి కోలుకున్న వారిలో కూడా మళ్లీ వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయని వచ్చిన వార్తలు ప్రజల గుండెల్లో గుబులు రేపాయి. అంటే కరోనా నుండి కోలుకున్న వారిలో ఇంకా వైరస్ దాగి ఉందని.. ట్రీట్మెంట్ తర్వాత వారికి టెస్ట్ చేయగా రిజల్ట్ 'నెగిటివ్' అని వచ్చినా వారిలో మళ్లీ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి అని కొన్ని అధ్యయనాలు వెల్లడించడం జరిగింది. దీనితో వైరస్ కు ఇక అంతేలేదని అంతా భయభ్రాంతులకు గురయ్యారు.

 

 

కానీ తాజాగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు మరియు అధ్యయనాలు జరిపి ఒకసారి కరోనా వ్యాధి నుండి బయట పడిన వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సౌత్ కొరియా వారు చేసిన అధ్యయనం ప్రకారం వైరస్ నుండి కోలుకున్న వారిలో ఒక్కరిలో కూడా కరోనా వైరస్ మళ్లీ రియాక్ట్ కాలేదని.... ఒకసారి కరోనా 'నెగిటివ్' అని టెస్ట్ లో చూపిస్తే వారిలో ఎట్టి పరిస్థితుల్లో వైరస్ లక్షణాలు కనిపించవు అని స్పష్టం చేశారు.

 

అంతేకాకుండా నిర్భయంగా వారి రక్తం నుండి వచ్చిన ప్లాస్మా తో 'ప్లాస్మా థెరపీ' నిర్వహించచని మరియు వారి ఒంటిలో ఒకసారి వైరస్ ను ఎదిరించి నిలిచిన యాంటీబాడీస్ వారికి ఎల్లకాలం రక్షణగా ఉంటాయని చెప్పడంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: