సమాజంలో బ్రతకాలంటే ఎంతో దైర్యం కావాలి.. అందులో భారతదేశ సరిహద్దుల్లో డ్యూటీ నిర్వహించాలంటే ధైర్యంతో పాటుగా మానసికంగా బలవంతుడిగా ఉండాలి.. ఒక జవాను భారతదేశానికి ఎంతో అమూల్యమైన వ్యక్తి.. అలాంటి వారి ప్రాణాలు ఊరికే పోతే దానిలో అర్ధం ఏముంది.. అందులో ఒక మనిషి బలహీనునిగా మారితే అతని మనస్సు అతన్ని కోతిలా ఆడిస్తుంది.. అతనిలోని జ్ఞానాన్ని చంపేసి.. విచక్షణ కొల్పోయి ప్రవర్తించేలా చేస్తుంది.. దీనివల్ల మనిషిలో ఉన్న స్వార్ధం, కోపం బయటకువచ్చి మనిషిని మృగంగా మార్చేస్తుంది.. ఇదిగో ఇప్పుడు ఇలాగే జరిగింది..

 

 

అదేమంటే రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్ సెక్టార్ వద్ద డ్యూటీ చేస్తున్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సీనియర్ ఆఫీసర్‌ను చంపడమే కాక తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఒక్క క్షణం తనలో పొంగి వస్తున్న ఆవేశాన్ని కట్టడి చేస్తే ఇలా జరిగేది కాదు.. అందుకే మనిషి మనసు ఎప్పుడు నియంత్రణలో ఉండాలి.. దానికి స్వేచ్చను ఇస్తే తద్వార వచ్చే ఫలితాలు ఇలాగే భయంకరంగా ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ.. ఇకపోతే శివ చందర్ అనే కానిస్టేబుల్ సర్వీస్ ఆయుధంతో సబ్-ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పాల్ సింగ్ ను కాల్చి.. తాను సూసైడ్ చేసుకున్నట్లు బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ చెప్పారు.

 

 

జోధ్‌పూర్‌లోని బీఎస్ఎఫ్ అధికారుల సమాచారం ప్రకారం.. జార్ఖండ్‌లో ఉండే శివ చందర్‌కు శ్రీగంగానగర్ సెక్టార్ లోని రేణుకా పోస్ట్ వద్ద డ్యూటీ పడింది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి నుంచి సెలవు తీసుకుని తాజాగా తిరిగి విధుల్లోకి చేరాడు. ఈ క్రమంలో  శివ చందర్ ఆదివారం అంటే నిన్న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడని రవీంద్ర పాల్ సింగ్ మందలించాడు.. అలా మాట మాట పెరగగా..  శివ చందర్ కోపంతో తన దగ్గరే ఉన్న సర్వీస్ వెపన్ తో రవీంద్ర పాల్ సింగ్ ను షూట్ చేశాడు. స్పాట్ లోనే ఆ అధికారి మరణించడంతో శివ కూడా తనకు తానుగా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడని అధికారులు చెప్తున్నారు..

 

 

చూశారా శత్రువుల గుండెలు చీల్చవలసిన తుపాకీ గుండు అది మోసే వారి ప్రాణాలనే తీసింది.. ముఖ్యంగా జవాన్లకు ఉండవలసింది శత్రువుల పై కోపం.. తన వారిపై ప్రేమ.. అదే ఇక్కడ లోపించడం వల్ల రెండు ప్రాణాలు పోయాయి.. మరో సైనికున్ని ఈ స్దాయికి తీసుకు రావాలంటే ఎంత కష్టం.. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోకుంటే జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగుస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: