ఇండియన్ సినిమాలోనే కాదు భారత రాజకీయాల్లో కూడా తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి తమిళనాడు మాజీ సిఎం జయలలిత. ఆమె జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగినా సరే కొన్ని కొన్ని తప్పులు మాత్రం ఆమె జీవితాన్ని నాశనం చేసాయి అని అంటారు. ఆమె ప్రేమ వ్యవహారం నుంచి రాజకీయం వరకు అన్నీ కూడా ఆమె ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఆమె పెళ్లి చేసుకోకుండా అలా మిగిలిపోయి చివరి రోజుల్లో ఎవరూ లేని వ్యక్తిగా ఆమె చనిపోవడం నిజంగా కన్నీరు పెట్టించింది అనే చెప్పవచ్చు. ఆమె జీవితంలో ఎన్నో విజయాలు సాధించింది. 

 

పిల్లలు లేని ఆమె తమిళనాడు రాష్ట్రం మొత్తానికి అమ్మగా మారిపోయారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆమె జీవితంలో ఎక్కువగా విషాదాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆమె శోభన్ బాబు ని ప్రేమించడం ఆయనకు దగ్గర కావడం ఆయనను పెళ్లి చేసుకోవాలి అనుకుని కూడా చేసుకోలేక ఒంటరి గా ఉండిపోవడం ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం అన్నీ కూడా ఒక సంచలనమే తన జీవితంలో ఆమె సాధించిన విజయాలు ఇండియన్ సినిమాలో ఏ ఒక్క నటి గాని రాజకీయ నాయకుడు గాని చూడలేదు అని చెప్పవచ్చు. 

 

ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినా సరే రాజకీయాల్లో ప్రభావం చూపించిన మహిళలు అనగానే ఆమె గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ఆమె ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చివరి వరకు తనను తాను కంట్రోల్ చేసుకుని ఏ ఒక్కటి కూడా తన కోసం తాను ఉంచుకోలేదు. ఆమె నివాసం ఒక్కటే ఆమెకు మిగిలింది. చివరికి ఆమె మరణం కూడా విషాదమే అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె హత్యో ఆత్మహత్యో తెలియకుండా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: