ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది ప్రస్తుతం డయాబెటిస్ బారినపడి  మాత్రలతో జీవితాలు గడుపుతున్న వారు చాలామంది. డయాబెటిస్ కి ఏదైనా మందు దొరికితే బాగుండు అని అనుకోని  వారు ఉండరు. కానీ ఈ డయాబెటిస్ను పూర్తిగా నయం చేసే మందులు మాత్రం ఇప్పటివరకు లేదు అని చెప్పాలి. అయితే రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం కారణంగా డయాబెటిస్ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా రక్తంలో చక్కెరను నియంత్రించే ప్రత్యేక వైద్య గ్లూకోస్ సెన్సింగ్ న్యూరాన్లను  పరిశోధకులు గుర్తించారు. 

 

 

 హైపోగ్లేసిమియాగా  పిలిచే రక్తంలో... తక్కువగా తక్కువ చక్కెర శాతం ఉండడం ప్రాణాంతకమైనది అని చెప్పవచ్చు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి అయితే రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రక్తంలో చక్కెర శాతం అధికంగా రాకుండా ఉండేందుకు ఇంటెన్సివ్ ఇన్సులిన్  చికిత్స పై ఆధార పడుతూ వుంటారు చాలామంది. ఎందుకంటే రక్తంలో చక్కెర సమతుల్యత సరిగ్గా ఉన్నప్పుడే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే రక్తంలో చక్కెరను సమతుల్యతతో ఉంచే ప్రాథమిక విధానాలను గుర్తించి ... వాటిని బాగా అర్థం చేసుకొని వాడటం ద్వారా ఇలాంటి పరిష్కారాలు వెతుక్కోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. 

 

 

 ఇక డయాబెటిస్ వ్యాధి ఉన్నవారిలో రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే గ్లూకోజ్ సెన్సింగ్ న్యూరాన్ల బేయలర్ వైద్య కళాశాలకు చెందిన పరిశోధకుడు డాక్టర్ యోంగ్ జు  కనిపెట్టారు. ఎలుకల్లో  తీవ్రమైన హైపోగ్లైసీమియా ను నివారించేందుకు ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే గ్లూకోస్ సెన్సర్ న్యూరాన్లు రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం పెరగడం లాంటివి జరిగినప్పుడు వాటిని గ్రహించి వేగంగా ప్రతిస్పందిస్తాయి  అంటూ ఆయన తెలిపారు. ఈ ప్రతిస్పందనలో  వ్యక్తి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి డయాబెటిస్ను సాధారణ స్థాయిలో ఉంచేందుకు ఉపయోగపడతాయి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: