దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి మద్యం అమ్మకాలు పూర్తిగా బంద్ చేశారు. అంతే కాదు బార్లు, క్లబ్లులు క్లోజ్ చేయడంతో ఎంత ఖరీదైనా సరే మందు దొరికితే బాగుండురా బాబో అనే పరిస్థితి కి వచ్చింది.  అయితే ఎక్కడా షాపులు తెర్చుకోలేదు.. దాంతో కొంత మంది మద్యానికి బానిసలైన వారు సొంత ప్రయోగాలు చేసుకొని ప్రాణాల మీదకు దెచ్చుకున్నారు. అంతే కాదు ఎంతో రీస్క్ తీసుకొని దొంగచాటుగా అమ్మి పోలీసులకు చిక్కిపోయారు.. మరికొంత మంది ఆన్ లైన్ ద్వారా మందు తెప్పించుకుంటున్నారు.. ఇలా ఎన్నో రకాలుగా మందు బాబులు నానా తంటాలు పడుతున్నారు.

 

ఇలాంటి సమయంలో వేల లీటర్ల మందు పోరిల పాలైందంటే మందు బాబులకు గుండె పగిలిపోయేలాంటిది బాధ.  సాధారణంగా మద్యం ఎరులై పారుతుందని అంటుంటాం.. లాక్‌డౌన్‌ వల్ల ఏరుల్లో మద్యం పారేట్టు కనిపిస్తున్నది. అవును దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల లీటర్ల బీరు నిలువలు ఉండిపోయినట్టుగా తాజాగా కేంద్రం  రూ. 700 కోట్ల మద్యం వృథా కానుందని క్రాఫ్ట్‌ బ్రూవరీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఏఐ) వెల్లడించింది.

 

 

దాదాపు నెలన్నరగా పబ్బులు, బార్లు మూసి వేసి ఉండటమే దీనికి కారణమని ప్రకటించింది. బాటిళ్లలో నింపే బీర్ల మాదిరిగా కాకుండా క్లబ్బులు, బార్లలో లభించే ఫ్రెష్‌, క్రాఫ్ట్‌ బీర్లు తొందరగా పాడవుతాయని మద్యం ఉత్పాదక సంస్థల సంఘం (క్రాఫ్ట్‌ బ్రూవరీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా)వర్గాలు తెలిపాయి. తాజా సడలింపుల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా, బార్లు, క్లబ్బులకు సడలింపులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సంస్థలన్నీ బీరును పారబోసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇక 12 లక్షల కేసుల విదేశీ మద్యం కేసులు కూడా ఆయా రాష్ట్రాల బార్డర్ల వద్ద నిలిచిపోయినట్టు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: