రాజకీయాల్లో ప్రభావం చూపించిన వ్యక్తుల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది కొందరు ఉంటారు. వారిలో మాజీ  మంత్రి మాజీ స్పీకర్... కోడెల శివప్రసాదరావు. ఆయన జీవితంలో సాధించిన విజయాలు రాజకీయాల్లో తెచ్చుకున్న పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయాల్ల్లో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా రాజకీయాలను ఆయన శాశించిన సంగతి తెలిసిందే. ఆయనకు ముందు ఆయన తర్వాత అనే విధంగా కూడా రాజకీయాలు కొన్ని ఉన్నాయి అనే చెప్పవచ్చు. ఫ్యాక్షన్ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఆ ప్రాంతంలో నిలబడిన తీరు ఇప్పటికి సంచలనమే. 

 

ఒక మాజీ సిఎం కుటుంబానికి ఆయన ఎదురు నిలిచిన తీరు అప్పట్లో ఒక సంచలనం. అయితే ఆయన జీవితంలో మరణం మాత్రం నిజం గా బాధాకరం. ఒక వెలుగు వెలిగిన ఆయన మరణించిన విధానం మాత్రం చాలా మందిని బాధ పెట్టింది అనే చెప్పవచ్చు. ఆయన మరణం గురించి ఇప్పటికి చర్చలు జరుగుతూనే ఉంటాయి అనేది వాస్తవం. ఆయన ఉరి వేసుకుని మరణించడం చాలా మంది తట్టుకోలేకపోయారు. పల్నాడు ప్రాంతంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన ఆయన ఆ విధంగా మరణించడం చాలా మందికి కష్టంగానే అనిపించింది కొన్ని రోజులు. 

 

పార్టీ అధికారంలో లేకపోవడం ఆయన సంతానం కారణంగా అవమానాలు ఎదుర్కోవడం వంటివి ఎక్కువగా జరిగాయి. తన జీవితంలో ఆయనకు కొడుకు చనిపోవడం ఒక విషాదం అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమి తర్వాత ఆయనకు ఎదురైన అవమానాలు అన్నీ కూడా ఒక విషాదం అనే చెప్పుకోవచ్చు. ఆయన జీవితం ఆధారంగా సినిమా కూడా ఒకటి వచ్చింది. జీవితంలో ఆయన సాధించిన విజయం చివరి రోజుల్లో ఆయన ప్రాణాలను కాపాదలేకపోయింది అనేది వాస్తవం. ఆయన అలా మరణించి ఉండకూడదు అని అంటారు...

మరింత సమాచారం తెలుసుకోండి: