తమిళనాడు రాజకీయాలు అనగానే చాలా మందికి ముందు వినపడే పేరు జయలలిత. ఆమె ముందు ఆమె తర్వాత అనే విధంగా రాజకీయాలు అక్కడ ఉన్నాయి అనేది వాస్తవం. ఒక తిరుగులేని శక్తిగా ఆమె ఆ రోజు నిలబడ్డారు. ఎప్పుడు అయితే ఎమ్జీ ఆర్ మరణించారో అప్పటి నుంచి కూడా ఆయన స్థాపించిన అన్నాడిఎంకె పార్టీని ఆమె నిర్మించడం ఆమె సీట్లు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం చిన్న చిన్న వాళ్ళను కేబినేట్ లోకి తీసుకోవడం అన్నీ కూడా ఒక సంచానంగా చెప్పుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఆమె చూపించిన ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

 

అయితే 1991 లో ఆమెకు ఎదురైన అనుభవం మాత్రం ఆమె గాని భారత రాజకీయాలు గాని మర్చిపోయే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. అసెంబ్లీ లో ఆమె చీరని అప్పటి విపక్షం లాగడం ఒక సంచలనం. ఆ తర్వాత విపక్షం మీద ఆమె చేసిన విమర్శలు అక్కడి నుంచి ఆమె కరుణానిధి ని వ్యతిరేకించిన తీరు అన్నీ కూడా ఒక సంచలనం గానే చెప్పుకోవచ్చు. ప్రతీ సందర్భంలో ఆమె ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు అనే చెప్పాలి. ముఖ్యమంత్రి గా ఎన్నిక అయిన తర్వాతే సభలో అడుగు పెడతాను అని ఆమె చెప్పి ఆమె చేసిన రాజకీయం మాత్రం ఒక సంచలనం అని అంటారు. తన జీవితంలో ఆమె సుఖపడినా పడకపోయినా సరే రాజకీయాల్లో తన మాటను ఆమె నెగ్గించుకున్న తీరు ఒక సంచలనం. 

 

ఆ రోజు ఆమె చీర లాగాదాన్ని చాలా మంది తప్పుబత్తడమే కాదు తమిళనాడు మొత్తం కన్నీరు పెట్టింది. ఒక మహిళను ఈ విధంగా అవమానిస్తారా అంటూ చాలా మంది  అక్కడి ప్రజలు ఆమెకు అండగా నిలబడ్డారు అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె సిఎం అయిన తీరు కూడా ఒక సంచలనమే.

మరింత సమాచారం తెలుసుకోండి: