ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రతాపమేంటో చూపిస్తోంది. ప్రధానంగా ఉత్తరాదిన మహారాష్ట్రలో.. దక్షిణాన తమిళనాడులో ఎందరో అమాయకుల్ని ఆస్పత్రి పాలు చేస్తోంది. 
మన భారత దేశంలో 37వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయితే. అందులో 12వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి చూస్తే ఉత్తరాదిన మహారాష్ట్ర ప్రాంతంలోనే ఎక్కువగా కరోనా కేసులు బయటపడటం ఆందోళన కలిగించే విషయం. 

 

ఇక దక్షిణాదిలోని తమిళనాడు విషయానికొస్తే.. ఈ ప్రాంతంలో  వరుసగా కరోనా కేసులు నమోదవడం తమిళనాడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే 2,700లకు పైగా కేసులు నమోదవగా అందులో 170కు పైగా పాజటివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2,700లకు పైగా ఉన్న కేసుల్లో దాదాపు 1900లకు పైగా కేసులు ఢిల్లీతో సంబంధం ఉన్నవే. చెన్నై మాత్రమే కాదు కోయంబత్తూరులో కూడా ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్నాయి. 

 

కరోనా దెబ్బకు చెన్నైలో పరిస్థితి దయనీయంగా మారింది. లాక్ డౌన్ దెబ్బకు ఎందరో అభాగ్యులకు మూడు పూటలా తిండిదొరకని పరిస్థితి దాపురించింది. ఇది గమనించిన ఓ మహానుభావుడు కొందరికి ఆహారం అందించి వారి ఆకలిని తీర్చాడు.  అంతా బాగుంది కానీ.. ఆహారం అందించన ఆ యువకుడు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు జరుపగా అతనికి కరోనా ఉందని తేలింది. ఆ వ్యక్తి కొద్ది రోజులుగా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఎందరో కార్మికులు, పోలీసులతో పాటు పలువురికి దాదాపు వందమందికి ఆహారాన్ని అందించాడు. ఇప్పుడు అధికారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఆ యువకుడి దగ్గర ఆహారం తీసుకున్న వాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

 

తమిళనాడులో ఎక్కువ శాతం నమోదైన కరోనా కేసుల్లో చిన్నారులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. చెన్నైలో మొట్టమొదటి సారి ఓ హిజ్రాకు వైరస్ సోకింది. తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠిన చర్యలు అవలంభిస్తోంది. ఇప్పటి ఏపీ,తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో రాకపోకలను నిషేధిస్తూ ఓ గోడను కూడా కట్టింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా తమ ప్రాంతంలోకి వస్తే రెండు వారాల పాటు క్వారంటైన్ ను తరలిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: