దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ మహమ్మారి వైరస్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ కేసుల సంఖ్య 42,000 దాటిపోయింది భారతదేశంలో. ఈ మహమ్మారి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్న ఎక్కడ ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో రోజురోజుకూ ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. అయితే తాజాగా ఐసీఎంఆర్ కరోనా వైరస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో ఏకంగా 11,07233 టెస్టులు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలో కరోనా  వైరస్ రికవరీ రేటు 27.52 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

 

 అయితే దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2553 కొత్త కేసులు నమోదయ్యాయని 72 మంది ఈ మహమ్మారి వైరస్ కారణంగా చనిపోయారు అని తెలిపింది. కేవలం మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే 12296 మంది కరోనా  వైరస్ బారిన పడ్డారు అంటూ తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇప్పటివరకు మహారాష్ట్రలో 521 మంది చనిపోయారు అని తెలిపింది. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఢిల్లీ ఉందని ఢిల్లీలో 4122 కేసులు నమోదు కాగా 62 మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోయినట్టు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో 4122  కేసులు నమోదు కాగా 156 మంది చనిపోయినట్లు ఐ సి ఎం ఆర్ వెల్లడించింది. 

 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు కరోనా  వైరస్ను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రజల అందరి సహకారంతోనే కరోనా వైరస్ ను భారత దేశం నుంచి తరిమి కొట్టేందుకు వీలుంటుంది అంటూ చెప్పుకొచ్చింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అందుకే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  చెబుతున్న సూచనలు సలహాలను పాటించాలి అంటూ సూచించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: