ధనం మూలం ఇదం జగత్ అన్నారు.. అది అప్పుడు ఇప్పుడు ధనం రోడ్లపై కనిపిస్తే చాటు పరుగులు తీస్తున్నారు జనాలు.  రోడ్డు పై ఒక్క రూపాయి దొరికినా అది మంచి శుభదినం అనుకొని తెగ మురిసి పోతారు.. అలాంది రోడ్లపై రూ. 100, 500 నోట్లు దొరికితే వారి ఆనందానికి అవధులు ఉండవు.. ఎవరో పుణ్యాత్ముడు తమ బాధ అర్థం చేసుకొని ఇలా పడవేసుకున్నాడని దీవిస్తారు.  అలాంటిది ఈ కరోనా మహమ్మారి దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడైనా డబ్బులు కనిపిస్తే చాలు వాటికి కరోనా వైరస్ అంటించి పడవేస్తున్నారని రూమర్లు పుట్టుకొచ్చాయి. అంతే రోడ్డుపై పడ్డ డబ్బును పాపంగా చూస్తున్నారు. రోడ్డు మీద రెండు వేల నోటు కనిపించినా అందుకోకుండా పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. కరెన్సీతో కరోనా వైరస్ వ్యాప్తి చెందిస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో రోడ్డు మీద నోట్లు కనిపించినా కామ్‌గా వెళ్లిపోతున్న పరిస్థితులు దాపురించాయి.  

 

ఇదిలా ఉంటే.. కైతల్‌లోని కర్ణ్‌ విహార్‌లో జింద్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు దుండుగులు రూ.500 నోట్లను వెదజల్లి వెళ్లారు. దాదాపు రూ.15 వేలు విలువజేసే కరెన్సీ నోట్లపై రాళ్లు ఉంచారు. కావలసి పెట్టినట్టుగా పెట్టారు. ఆ నోట్లను చూసిన స్థానికులు వాటిని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు స్థానికులు వెంటనే సిటీ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్‌, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు.   ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను శానిటైజింగ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

అయితే కొంత మంది పోకిరీలు కావాలని ప్రజలను భయ పెట్టేందుకు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని.. మరికొంత మంది మురికి వాడల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. వారిని ఆదుకునేందుకు ఇలా చేస్తున్నారని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కరోనా భయంతో ప్రజలు నోట్లు తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు వెల్లడించారు. అయితే దుండగుల్ని ఎవరూ చూడలేదని ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. కాగా, కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: