జగన్ అంటేనే ఒక ఇమేజ్. ఆయన మిగిలిన నాయకులకు భిన్నం. ఆయన వ్యక్తిత్వమే ప్రత్యేకం. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ జగన్ కి ఒక విశిష్ట స్థానం ఉంది. దటీజ్ జగన్ అని అంతా అన్న సందర్భాలు  గత పదేళ్ళ ఆయన రాజకీయ జీవితంలో అనేకం ఉన్నాయి. అటువంటి జగన్ ఇపుడు కొంత తడబడ్డారా, పొరపడ్డారా..

 

అన్న సందేహం కలగకమానదు. జగన్ మాట ఇస్తే అది రామభాణమే. అటువంటి  జగన్ ఇపుడు లాక్ డౌన్ సడలింపులను ఆసరాగా చేసుకుని మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించడం పెద్ద ఎత్తున విమర్శలకు గురి అవుతోంది. జగన్ చెప్పిందేంటి చేస్తున్న‌దేంటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మహిళా సంఘాల నుంచి వివిధ పార్టీల మహిళా నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.

 

లాక్ డౌన్ తరౌవత స‌డలింపులు ఉంటే అవి ముఖ్యమైన వాటికి ఉండాలి. అవి జనం కూడా అంతా హర్షించేలా ఉండాలి. కానీ మందు బాబులను తయారు చేయడానికి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఇదేం పని అని అంతా అంటున్నారు. ఈ ఎంగిలి కూడుతోనే ఖజానా నిండుతుందా అన్న బాధాకరమైన ప్రశ్నలు కూడా మేధావులు సంధిస్తున్నారు.

 

గత నలభై రోజులుగా మహిళలు నిజంగా ఆనందించారు. లాక్ డౌన్ పుణ్యమా తమ భర్తలకు మెల్లగా మద్యపాన వ్యసనం లేకుండా పోతే తమ కుటుంబం హాయిగా ఉంటుందని కూడా భావించాయి. తాగుబోతులు లేకపోతే గొడవలు లేవు, దొమ్మీలు లేవు, యాక్సిడెంట్లు కూడ లేవు. అటువంటి రోజు రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు.

 

ఇపుడు కేంద్రం మద్య దుకాణాలకు అనుమతించింది. దాంతోనే అన్ని రాష్టాలు తెరచాయి. వారికి మద్యం ఆదాయ వనరు కావచ్చు. పేదల ఇళ్ళలో చిరునవ్వు ముఖ్యం అనుకునే జగన్ ఈ పని చేయడమే ఇపుడు మహిళల ఆగ్రహానికి గురి అవుతోంది. దశలవారీగా మద్యనిషేధం ఎత్తివేస్తానని చెబుతున్న వైసీపీ సర్కార్ కనీసం కొన్నాళ్ళ పాటు అయినా మద్యం దుకాణాలు మూసి ఉంచితే తప్పేముంది అన్న మాట కూడా వినిపిస్తోంది.

 

 మొత్తానికి ఇపుడు మహిళా లోకం అంతా జగన్ సర్కార్ మీద ఆగ్రహంగా ఉన్నారు. పైగా మద్యం ధరలు పెంచేశారు. దాని వల్ల మందుబాబులు తగ్గరు, ఇంట్లో మరింతగా సొమ్ము తీసుకుని రోడ్లపైకి వచ్చి మరీ  తాగుతారు. దాంతో పేదల ఇల్లు గుల్లేనన్న మాట వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: