ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాపకింద నీరులా విరుచుకు పడుతుంది. ఎవరి ద్వారా వైరస్ సోకుతుంది అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైరస్ ను అరికట్టేందుకు భారతదేశంలో మూడో విడత లాక్ డౌన్ కూడా అమలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మేము ఇచ్చే నిబంధనలు పాటిస్తే చాలు మనం విజయం సాధించవచ్చు అని చెబుతున్న కూడా ఏ ఒక్కరు కూడా ఏ మాట వినడం లేదు. ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాలి, ఎవరైనా దగ్గుతూ, తుమ్మినప్పుడు జాగ్రత్త వహించాలి. అప్పుడే కానీ కరోనా వైరస్ మన దగ్గరకు రాదని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పదే పదే తెలియజేస్తున్నారు. అయినా కూడా ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదు అనే చెప్పాలి. 

 

ముఖానికి మాస్క్  కట్టుకుంటే ఎక్కడ గ్లామర్ పోతుందో అని, మరికొందరు బిల్డప్ తో రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఈ తరుణంలో కడుపు నింపుకోవడానికి కొన్ని కోతులు ఏం చేసాయో తెలిస్తే అవాక్కవుతారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ అస్సాం జాతీయ రహదారిలో ఒక వ్యక్తి  పుచ్చకాయలు, అరటి పండ్లు మీకు కావాలి అంటే నేను చెప్పినట్లు భౌతిక దూరం పాటిస్తే అప్పుడు ఇస్తాను అంటూ కోతులకు ఒక వ్యక్తి తెలియజేశాడు. దానితో అది కడుపు నింపుకోవడం కోసం కోతులు అన్నీ కూడా భౌతిక దూరం పాటిస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులు చెప్పిన మాట కోతులు, కుక్కలు పాటిస్తూ ఉంటే...మనుషులు మాత్రం అసలు వినటం లేదు అని చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు అనే చెప్పాలి.

IHG


ఇక ఈ ఫోటోసు చూసి కేంద్ర మంత్రి కిరణ్ తదితర అధికారులు కూడా వాటిని చూసి మనం నేర్చుకోవాలి అంటూ కొనియాడడం జరిగింది. అదే తరహాలోనే తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో కవాయి ప్రాంతంలో ఒక మూడు కుక్కలు కూడా యజమాని చెప్పినట్లు భౌతిక దూరం పాటించడం జరిగింది. యజమాని చెప్పిన మాటలను ఏ విధంగా వుంటున్నాయి ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. కనీసం వీటిని చూసి అయినా కూడా ప్రజల్లో మార్పు వస్తే బాగుంటుంది అని అధికారులు భావిస్తున్నారు. కాకపోతే ఆ ఫోటో ఇప్పుడు కాదులెండి... పాతది కానీ ఇప్పుడు అది పనికి వచ్చింది అంటూ ఆ కుక్కల యజమాని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: