అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా లైట్ గా తీసుకున్నారు. ఫ్లూ లాంటిది ఈ వైరస్ అని చాలా తేలికగా తీసి పారేశాడు. అయితే ఉన్న కొద్ది అమెరికాలో వైరస్ వ్యాప్తి చెందడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. మొదటిలో ఇటలీ మరియు స్పెయిన్ దేశాలలో ఎక్కువ పాజిటివ్ కేసులు మరియు మరణాలు బయటపడిన...అమెరికాలో వచ్చేసరికి పూర్తిగా వైరస్ వ్యాపించి ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు మరణాలు సంభవిస్తున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. దీంతో అమెరికా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఎవరికి వాళ్లు ఇళ్లలోనే ఉండిపోవాలని పరిస్థితి ఏర్పడింది.

 

ఎంతో అభివృద్ధి మరియు ధనిక దేశమైనా అమెరికాలో ప్రస్తుతం ఆ దేశం తీసుకున్న నిర్ణయాలకు తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు మరియు దేశాలకు చెందిన వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళలేక ఉన్న ఇంటిలోనే తిండికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది.

 

వాళ్ళను ఆదుకునే దిక్కు గాని వాళ్ళను కాపాడే దిక్కు గాని ఇప్పుడు అమెరికాలో లేదు అనేది వాస్తవం. అక్కడి ప్రభుత్వం కూడా వాళ్ళను ఆదుకునే అవకాశం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే నరకం చూస్తున్నారు. అమెరికాలో ఒక మనిషి బ్రతకాలు అంటే కనీసం 80 వేల వరకు అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అమెరికా పేరు చెబితే అమ్మో అని భయపడిపోతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: