2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. రాయలసీమలోని 52 స్థానాల్లో టీడీపీ కేవలం 3 స్థానాల్లో విజయం సాధించిందంటే ఆ పార్టీ పరిస్థితేమిటో సులభంగా అర్థమవుతుంది. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 
 
సొంత పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా వైసీపీకి మద్ధతిచ్చారు. వైసీపీ అనుమతిస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో కూడా టీడీపీపై వ్యతిరేకత పెరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ ఎన్నికల ముందు ప్రతి హామీని నెరవేరుస్తూ ఉండటంతో టీడీపీకి విమర్శించే అవకాశం కూడా లేకపోయింది అయితే రాష్ట్రంలో ఎలాగైనా బలపడాలనే ఉద్దేశంతో టీడీపీ వైసీపీ మీదకు అనిత అనే బాణాన్ని వదులుతోంది. 
 
2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అనిత తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. పది మంది తుగ్లక్ లను కలిపితే జగన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. లాక్ డౌన్ సమయంలో మద్యం అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాలని కోరారు. 
 
జగన్ సున్నా వడ్డీలు మహిళల కోసం తీసుకొచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నారని... ఈ పథకాన్ని చంద్రబాబు గత ఐదేళ్లలో అమలు చేశారని అన్నారు. టీడీపీ ఇచ్చిన పరిమితి కంటే ప్రస్తుతం మూడు లక్షల పరిమితిని తగ్గించారని అన్నారు. వైసీపీ గట్టిగా మాట్లాడితే ఎదురుదాడి చేస్తుందని... రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని వ్యాఖ్యలు చేశారు. మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ నిధులను ప్రభుత్వమే తక్షణమే డిమాండ్ చేయాలని అన్నారు. అనిత జగన్ ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: