లాక్ డౌన్ కారణంగా ఏపీకి రాకుండా చంద్రబాబు సెల్ఫ్ క్వారంటైన్లొ ఉన్నారు. ఆయన వయసు డెబ్బై ఏళ్ళు, ఆయన అక్కడ తన ఇంట్లో ఉండడమే సేఫ్. అయితే బాబు తన రాజకీయాన్ని మాత్రం అసలు ఆపుకోవడంలేదు. ఆయన తెల్లారిలేస్తే జగన్ మీద విరుచుకుపడుతున్నారు. ఇక ఆయన కుమారుడు లోకేష్ వయసు చిన్నదే. కానీ ఆయన కూడా ఏపీకి రానంటున్నారు.

 

పోనీ అక్కడ గమ్మున ఉంటున్నారా అంటే ఆయన తన ట్విట్టర్ తీసి బురద జల్లేస్తున్నారు.  ఇక అదే హైదరాబాద్ లో ఉన్న  జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా రాజకీయం చేస్తున్నారు. ఆయన కూడా జగన్ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా జనసైనికులతో ఆయన మాట్లాడుతూ ఏపీలో కరోనా కేసులు పెరిగిపోవడానికి జగనే కారణమన్నట్లుగా మాట్లాడారుట.

 

కరోనా అంటే ఏం కాదు అది సాధారణ జ్వరం లాంటిదేనని జగన్ చెప్పడం వల్లనే ఏపీలోని ఆరోగ్య శాఖ అధికారులు పెద్దగా శ్రధ్ధ తీసుకోలేదన్నట్లుగా కూడా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే అటు జగన్ని, ఇటు అధికారులను కూడా కరోనను లైట్ గా తీసుకున్నారని పవన్ బండలు వేశారన్నమాట. 

 

ఇది నిజమే అనుకుంటే దేశంలో, ప్రపంచంలో కరోనా కేసులు పెరగడానికి కూడా జగనే కారణం అని పవన్ చెప్పిఉంటే బాగుండే
దేమో. నిజానికి పవన్ కే కాదు, మూడు సార్లు సీఎంగా పాలించిన చంద్రబాబుకే అర్ధం కాని విషయం ఒకటి ఉంది. కరోనా కేసుల కట్టడి అన్నది ప్రజల చేతుల్లోఉంది. ప్రజలు తలచుకుంటేనే ఈ కట్టడి సాధ్యం. ప్రతీ ఇంటికీ వెళ్ళి పోలీస్ ని కాపాలా పెట్టలేరుగా.

 

ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. ఆ విధంగా ఉంటే కరోనా కట్టడి అవుతుంది. మరి అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కరోనా పెరగడానికి ప్రజలు తిరగడమే కారణం. అక్కడి ప్రభుత్వాలు ఎంత చెప్పినా వినలేదు. అందువల్ల కరోనా కేసుల పెరుగుదల, తగ్గుదల అంతా కూడా ప్రజల చేతుల్లో చేతల్లో ఉంటుంది. 

 

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఏపీలో కరోనా టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి, దాని వల్ల కూడా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయినా కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నపుడు రాజకీయ విమర్శలు ఈ సమయంలో చేయడం ఎవరికైనా సమంజసం కాదేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: