కరోనా నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ లో మద్యం   దుకాణాలను ప్రారంభించాలని  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించడం  తో  రాజకీయలు  మరోసారి వేడెక్కాయి  .మద్యం దుకాణాలు ప్రారంభించాలని  నిర్ణయించటం పట్ల అధికార , ప్రతిపక్షాల మధ్య మాట ల  యుద్ధం కొనసాగుతోంది . మద్యం దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కోసమే ధరలను పెంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు .

 

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాళా తీయాలన్నదే టీడీపీ నేతల ఉద్దేశ్యమని అన్నారు . అందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు . రాష్ట్రంలో  12 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నప్పటికీ మద్యం దుకాణాల ఎలా ప్రారంభిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు ప్రశ్నించారు .ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ ఆటలాడుతోందని మండి  పడ్డారు  . గత టిడిపి ప్రభుత్వ హయాం లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళ తీసిందని ...అయినా ఈ  విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో  పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం దుకాణాలకు ప్రారంభించాలని ఆ పార్టీ నేతలు , మంత్రులు చెబుతున్నారు.

 

అయితే కరోనా కట్టడి కోసం కాకుండా , రాష్ట్ర ఖజానా కు రాబడిపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించడం దారుణమని టీడీపీ నేతలు  విరుచుకుపడుతున్నారు . ప్రజల ప్రాణాలకంటే  రాష్ట్ర ఖజానాకు ఆదాయం ముఖ్యమా ? అంటూ ప్రశ్నిస్తున్నారు . రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత సమయం లో మద్యం దుకాణాలను ప్రారంభించాలని నిర్ణయించడం ద్వారా జగన్ సర్కార్ కరోనా కు స్వాగతం పలుకుతున్నట్లయిందని ఎద్దేవా చేస్తున్నారు . 

 

ఒకవైపు అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం కొనసాగుతుండగానే మరొకవైపు రాష్ట్రం లో మద్యం దుకాణాలను ప్రారంభం కావడం కిమీ మేరకు మద్యం ప్రియులు బారులు తీరడం , వారు కనీస సామాజిక దూరం పాటించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: