కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు రాజకీయ నాయకులు, స్వచ్చంద సంస్థలు, మానవతా వాదులు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు పేద ప్రజలకు ఏదోరకంగా సాయం చేస్తూనే ఉన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు లాంటివి అందిస్తున్నారు.

 

అయితే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు కొందరు నేతలు సామాజిక దూరం పాటించడం లేదు. ఎక్కువ శాతం వైసీపీ నేతలు సామాజిక దూరం పాటించకుండా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అదేవిధంగా కొందరు టీడీపీ నేతలు కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారు. కాకపోతే గత రెండు మూడు రోజుల నుంచి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి, పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి.

 

దీంతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై, పోలీసులపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ సైతం స్పందిస్తూ..పేద వాడికి ముద్ద అన్నం పెట్టినందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టే దుస్థితికి చేరిన జగన్ గారి మానసిక పరిస్థితికి నా సానుభూతి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

 

అయితే ఇక్కడ చినబాబు చెప్పిన పాయింట్ బాగానే ఉంది. పేదలకు సాయం చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కాకపోతే సామాజిక దూరం పాటించలేదని ఉద్దేశంతోనే పోలీసులు వారిపై కేసులు పెట్టారు. ఇక ఇక్కడ లోకేష్ మరొక విషయం గుర్తు తెచ్చుకుంటే బాగుండేదని వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు.

 

పేదలకు సాయం చేస్తూ సామాజిక దూరం పాటించని వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆల్రెడీ కేసు నమోదైందని చెబుతున్నారు. అలాగే మరికొందరుపై కూడా కేసులు ఉన్నాయని, కాబట్టి కేవలం టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని లోకేష్ చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: