ఏపీలో సామాజిక దూరం పాటించడంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం ఉంటారనే చెప్పి ఇన్ని రోజులు లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు పేదలకు తమవంతు సాయం అందిస్తున్నారు.

 

అయితే ఈ సాయం చేసే విషయంలో సామాజిక దూరం పాటించడం లేదని చెప్పి, రెండు రోజుల నుంచి టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై కూడా కేసు నమోదైంది. దీంతో నాని విజయవాడ పోలీసులపై మండిపడ్డారు. పేదలకు సాయం చేస్తున్న తనపై దొంగలు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

 

ఈ క్రమంలోనే సామాజిక దూరం పాటించని వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, అలాగే వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

 

ఇక ఈ ఆరోపణలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు.  కేశినేని నానితో పాటు, బోండా ఉమని కూడా కలుపుతూ వారిద్దరూ విజయవాడకు పట్టిన చీడపురుగులని, ఎంపీగా విజయవాడకు కేశినేని నాని చేసిందేమీ లేదని, కరోనా వైరస్ వచ్చిన 45 రోజుల తర్వాత ప్రజలకు సాయం చేయాలని నానికి అనిపించిందా? అని ప్రశ్నించారు. సొంత ట్రావెల్స్ ఉద్యోగులను మోసం చేసిన చరిత్ర నానిదని విమర్శించారు.

 

ఇలా ఎంపీ, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే, మధ్యలో పీవీపీ ఎంటర్ అయ్యారు. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్నప్పుడు సామాజిక దూరం నిబంధనలు పాటించం తప్పనిసరి కేశినేనికి చురక వేశారు. ఇక పీవీపీపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించినప్పుడు పీవీపీ నిద్రపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా వైన్స్, బార్లు ఓపెన్ చేయడం వల్ల ప్రజలు ఏ విధంగా ఎగబడుతున్నారో కూడా కనపడటం లేదా? అని నిలదీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: