ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న బాబు, లోకేష్ లపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు హైదరాబాద్ వదిలి రారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.

 

తాజాగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.  చంద్రబాబు, లోకేశ్ ఏపీకి రాలేదని విజయసాయి ఏడుస్తుంటే, పేదలకు సహాయం చేస్తే బొక్కలో వేస్తామంటూ.. టీడీపీ నాయకులపై సీఎం జగన్ కేసులు పెడుతున్నారని విమర్శించారు. అయితే ఇద్దరి మధ్యా మాటలు లేవా ఏంటి అంటూ విజయసాయి, జగన్ లని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే బాబు, లోకేశ్ బయటకి రావాలని డిమాండ్ చేసే ముందు.. యువ ముఖ్యమంత్రి అని డప్పు కొట్టే వైఎస్ జగన్‌ను బయటకు రమ్మని చెప్పండని విమర్శించారు.

 

అయితే ఇందులో ఇద్దరి మధ్యలో మాటలు లేవనే విమర్శ పూర్తిగా అర్ధరహితం అని అర్ధమవుతుంది. ఇక ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే బుద్దా అడిగిన దానిలో మంచి లాజిక్ ఉందని టీడీపీ నెటిజన్లు అంటున్నారు. విజయసాయి గత కొన్ని రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రావడం లేదని తెగ రచ్చ చేస్తున్నారని, ఇక్కడేమో టీడీపీ నేతలు బయటకెళ్ళి పేదలకు సాయం చేస్తుంటే కేసులు పెడుతున్నారని, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు,

 

అదేవిధంగా సీఎం జగన్ కూడా కరోనాని కట్టడి చేయడంలో భాగంగా సచివాలయం నుంచే సమీక్షలు చేస్తున్నారు. ఆయన కూడా బయటకెళ్ళే పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు కూడా లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో ఉండి, ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ఇక ఏపీకొచ్చిన ఆయన ఇంటిలో ఉండే సలహాలు ఇవ్వాలి, అలాంటప్పుడు ఆయన ఎక్కడ ఉంటే ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: