ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాణించాలంటే కచ్చితంగా సామాజిక వర్గాల సపోర్ట్ చాలా వరకు అవసరం. కుల ప్రాతిపదిక పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తుయని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. అటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసిపి పార్టీ లో సామాజిక వర్గాల కారణంగా కొన్నిచోట్ల చీలిక ఏర్పడుతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు వర్గానికి మరియు మంత్రి బోస్, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ వర్గాలకు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయితే మిగతా ఇద్దరు నాయకులు శెట్టిబలిజ వర్గానికి చెందిన వాళ్ళు.

 

తోట త్రిమూర్తులు గత ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుండి పోటీ చేసి వైసీపీ పార్టీ అభ్యర్థి శెట్టిబలిజ వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ పై ఓడిపోవడం జరిగింది. అయితే తోట త్రిమూర్తులు వైసిపి పార్టీ లోకి రావడంతో శెట్టిబలిజ వర్గాలకు చెందిన నాయకులు.. ఆయన రాక పై తీవ్ర స్థాయిలో మొదటి నుండి వ్యతిరేకంగానే ఉన్నారు.

 

ఇందు మూలంగానే తోట త్రిమూర్తులు తన బలం తూర్పుగోదావరిలో చూపించడానికి వైసీపీ పార్టీకి చెందిన పెద్ద నాయకులను తీసుకు రావడం జరిగింది. అదే సమయంలో చెల్లుబోయిన అనుచ‌రుడు మేడిశెట్టి ఇజ్రాయెల్ చెప్పుతో .... తోట పై దాడి చేయడం పెద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనను ఉద్దేశించి తోట త్రిమూర్తులు వర్గానికి చెందిన వాళ్ళు కావాలని వేణు అనుచరులు తమ నేత పై దాడి చేశారని అప్పట్లో ఆరోపించడం మనకందరికీ తెలిసినదే. దీంతో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సామాజికవర్గాల పరంగా వైసిపి పార్టీ చీలి పోయినట్లు కోనసీమ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: