కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం చేత లాక్ డౌన్ మరింత పెరగునుందని ప్రభుత్వం ఆలోచిస్తుండగా... రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.. ప్రజలను కాపాడనికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం బైక్ లు వేసుకొని బయట తిరుగుతున్నారు.. అలా పోలీసులు వారికి అవగాహన ఇస్తూ కాపాడుతున్నారు..


 

 

లాక్ డౌన్ కారణంగా అన్నీ రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడిన సంగతి తెలిసిందే.. అయితే, మద్యం దుకాణాలు కూడా బంద్ కావడంతో చాలా మంది మందుబాబులు వింతగా ప్రవర్తించారు. మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులు ఏది దొరికితే అది తాగేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌‌లోని రత్లం జిల్లా నిమాలి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం మద్యం తాగారు. వీరిలో ఆరుగురు వ్యక్తులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.




 

వారందరినీ రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.. కల్తీ మద్యమే ఘటనకు కారణంగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు చేపడతామని ఎస్పీ తెలిపారు.




 

కరోనా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే..లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో అక్రమార్కులు నకిలీ మద్యం తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించారు.. అంతేకాక రెడ్ జోన్ ఉన్న ఏరియాల్లో ప్రజలు మద్యం దుకాణాల వద్దకు వెల్లోదని హెచ్చరించారు.. కేవలం గ్రీన్ జోన్ ఉన్న ఏరియాల్లో మాత్రం మద్యం దుకాణాల వద్ద క్యూ లు కడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: