తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో ముందునుండి చాలా కఠినంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. చాలావరకు కరోనా వైరస్ నీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బాగానే కట్టడి చేయడం జరిగింది. వైద్య పరికరాల విషయంలో సిబ్బంది విషయంలో కేసీఆర్ చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటూ మరోపక్క అధికారులను అప్రమత్తం చేస్తూ ఉండటంతో తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలలో చాలా జాగ్రత్తలు తీసుకుని చాలెంజింగ్ గా రాణించారు.

 

 

మామూలుగా అయితే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను తన కుమారుడు కేటీఆర్ చేతిలో పెట్టి తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని వేసిన ప్లానింగ్ కరోనా వైరస్ వల్ల మొదటికే మోసం కి తెచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహా నగరం ఉన్నాగాని ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక కొరత ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని డిసైడ్ అవుతున్నారట. ఇంకోపక్క టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని విపక్షాలు కాచుకున్న క్రమంలో కేసీఆర్ తన దృష్టి మొత్తం రాష్ట్ర రాజకీయాల పైన పెట్టారంట.

 

 

తెలంగాణ పూర్వపు స్థితికి వచ్చే వరకు అనగా ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించ కూడదని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో పార్టీ నాయకులు కూడా కేసీఆర్ నీ రాష్ట్రం పైనే ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విషయంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రాణిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: