నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఏపి పోలీసులు ఊహించని విధంగా షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఏపీ సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంత నిర్ణయంతో క్యాన్సిల్ చేయించిన విషయం అందరికీ తెలిసినదే. ఎవరు ఊహించని విధంగా నిమ్మగడ్డ తీసుకొన్న నిర్ణయం అప్పట్లో అనేక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సీఎం జగన్... ప్రతిపక్ష నేత చంద్రబాబు దర్శకత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ఆరోపించడం మనకందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొస్తూ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్ నీ నియమించడం జరిగింది.

 

అయితే ఈ మధ్యలో పదవిలో ఉన్న టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖ రాసిన లెటర్ ఇప్పుడు ఆయన్నిరెడ్ హ్యాండెడ్ గా, ఎన్నికల వాయిదా విషయంలో ఇరికించడానికి ఏపీ పోలీసులకు అస్త్రంగా మారింది. మనకు తెలిసిన విషయమే గతంలో ఈ లెటర్ లో నిమ్మగడ్డ చేసిన సంతకం మామూలుగా అధికారిగా విధినిర్వహణలో చేసిన సంతకానికి తేడా ఉందని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దానిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే విచారణలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ టైప్ చేసిన ల్యాప్ టాప్ మరియు హార్డ్ డ్రైవ్ పగిలిపోయాయి అని పెన్ డ్రైవ్ పోయిందని పంతం లేని సమాధానాలు చెప్పడం జరిగింది.

 

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హైదరాబాదులో Cid ఆఫీసులో విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ల్యాప్ టాప్ మరియు హార్డ్ డ్రైవ్ పగలగొట్టడం దాని వెనకాల అధికారిక రహస్యాలను బయటపెట్టినట్లు కేసు అవుతుంది అని పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవం అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోలుకోలేని విధంగా శిక్ష అనుభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాగా జగన్ సర్కార్ పగడ్బందీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ ఏదో విధంగా కావాలని ఇరికించడానికి వేస్తున్న స్కెచ్ లు అని ప్రతిపక్షాలు  ఆరోపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: