ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  విజృంభిస్తుంన నేపథ్యంలో ఎన్నో  రోజులనుంచి ప్రపంచ దేశాలన్నింటిలో లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేయడంతో పాటు ఎలాంటి రవాణా ఎలాంటి సేవలు అందుబాటులో లేకుండా చేసింది.. అయితే తాజాగా ప్రపంచ  వ్యాప్తంగా అన్ని దేశాలలో సడలింపులు జరుగుతున్నాయి. క్రమక్రమంగా ప్రజలను కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఆంక్షలు విధిస్తే ప్రజల నుండి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంక్షల సడలింపు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దేశం తన దేశ పరిధిలో లాక్ డౌన్  నిబంధనలను సడలిస్తూ వస్తోంది. 

 

 ఎందుకంటే ఎక్కువ కాలం పాటు అంశాలు నడుమ ప్రజలను ఇళ్లల్లో ఉంచితే స్వేచ్ఛ  లేకపోవడం వల్ల ప్రజలు ఎలా ఘర్షణలు పడతారు అన్నదానికి సజీవమైన సాక్ష్యం.. ప్రస్తుతం మద్యం  కోసం పడుతున్న గొడవలు కానీ.. వలస కూలీల కు సంబంధించిన గొడవలు.. ఇక అమెరికా లాంటి దేశాల్లో అయితే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ప్రజలు. ఇలాంటి నేపథ్యంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు క్రమ క్రమంగా మారుతూ వస్తున్నాయి. వైరస్ వెలుగులోకి  వచ్చిన చైనాలో ప్రస్తుతం పర్యాటక కేంద్రాలు తెరిచి ఉంచారు. 

 

 బీజింగ్ లో పార్కులు ఓపెన్ చేయడంతో రెండు రోజుల్లో దాదాపు 17లక్షల మంది పర్యాటకులు వచ్చి సందర్శించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే షాంఘైలో ఉన్న పర్యాటక కేంద్రాలను కూడా లక్షకుపైగా నే పర్యాటకులు సందర్శించారు. ఇక మొదట భారీగా మరణాలు సంభవించినటువంటి స్పెయిన్ లో కూడా మార్చి 14 నుంచి అమలు లో ఉన్నటువంటి లాల్ డౌన్ పాక్షికంగా సడలింపులు  చేస్తూ.... పలు సౌకర్యాలు కల్పించడం వల్ల అనేకమంది మాస్కులు ధరించి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి  ఈ సడలింపులు మంచికి  దారితీస్తాయా చెడుకి  దారితీస్తాయా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: