ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలుసిందే . అయితే ఈ మహమ్మారి వైరస్ చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వైరస్ సముద్ర జీవుల నుంచి వచ్చింది అని చైనా చెబుతుంటే లేదు.. ల్యాబ్  లో  సృష్టించారని పలు దేశాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  సంబంధించి మరోసారి చర్చ  మొదలైంది. ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతం వెలుగులోకి వస్తోంది. అదే 5 ఐస్ కి సంబంధించినటువంటి అంశం. అమెరికాతో పోటీగా మరో 5 దేశాలు కలిసి.. చైనా మీద దర్యాప్తు జరుపుతున్నటువంటి అంశంలో... తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక టెలిగ్రామ్ పత్రిక ఐదు దేశాల దర్యాప్తు లోని  కొన్ని ప్రాథమిక సూత్రాలను తేల్చి చెప్పారు. 

 


 ఇక ఈ నివేదికలో ఉన్న కీలకమైన అంశాలు ఏమిటి అంటే సముద్ర జీవుల ద్వారా కరోనా  పుట్టుకొచ్చిందని చైనా చెప్పడం పచ్చి అబద్ధం. అది వుహన్ లోని  ప్రయోగశాల నుంచి బయటకు వచ్చింది అన్నది నిజం. ఇది బయట పడకుండా చైనా అధికారులు ప్రయోగశాల లో ఉన్నటువంటి నమూనాలను నాశనం  చేసారు. ఇక వుహాన్  మార్కెట్ ని కూడా పూర్తిగా బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేశారు. కరోనా  వైరస్ మనిషి నుంచి మనిషికి సోకదు అంటూ చైనా పెద్ద అబద్ధం ఆడింది. తైవాన్ లాంటి సరిహద్దు దేశాలు ఖండిస్తున్నప్పటికీ.. ఆఖరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెనకేసుకొచ్చి... ఇది అంతర్జాతీయ పారదర్శకతను దెబ్బతీసింది. 

 


 ఇక అంతే కాకుండా కరోనా  వైరస్ గురించి సరైన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా ప్రజలు తెలుసుకోకుండా అడ్డుకుంటూ వచ్చింది చైనా ప్రభుత్వం. ఇక వైరస్ కేసులను తగ్గించి చెప్పడంతో ఇతర దేశాలు వెంటనే అప్రమత్తం కావడానికి అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి మనిషి నుంచి మనిషికి కరోనా సోకుతుంది  అని తెలిసినప్పటికీ కూడా అది ప్రపంచ దేశాలకు తెలియకుండా దాచింది చైనా ప్రభుత్వం. అంతే కాకుండా ఈ మహమ్మారి వైరస్ గురించి ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నించినా చాలామందిని కనిపించకుండా చేశారు. ఇలా చైనా చాలా దుర్మార్గాలకు పాల్పడింది అంటూ నిజాలను నిగ్గు తేల్చింది. మరి దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా కేవలం మాటల యుద్ధానికి మాత్రమే సరిపోతుందా అన్నది మాత్రం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: