ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల గేట్లు తెరిచారు. మందు ప్రియులు మద్యం షాపుల ముందు క్యూ కట్టేశారు. ఈరోజంతా ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో తెగ చెక్కర్లు కొట్టేశాయి. కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు. కొందరు ఉదయం నుంచే మందు దుకాణాల ముందు బారులు తీరారు. ఈ హడావిడిలో మద్యం ధర 20 శాతం పెరిగినా మందు బాబులు పెద్దగా పట్టించుకోనే లేదు.

 

 

అయితే ఇంతకీ ఇంత జోరుగా క్యూకట్టిన మందుబాబులు తొలి రోజు ఎంత మద్యం కొనుగోలు చేశారో తెలుసా.. ఏకంగా రూ. 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు ఏపీలో జరిగినట్టు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకే రూ. 31 కోట్ల రూపాయల వరకూ ఆబ్కారీ శాఖలు లెక్కలు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే ఏపీ మొత్తం మీద దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

 

 

అయితే మద్యంషాపులు తీసినా.. రాష్ట్రంలో దశల వారిగా మద్యపానాన్ని నిషేధించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. అందులో భాగంగానే ధరలు పెంచామని, మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

 

 

రాష్ట్రాన్ని దివాళా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారా అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగకుండా తమ ప్రభుత్వం 3వేల కోట్ల ప్రత్యేక నిధి ద్వారా నియంత్రణ చేస్తున్న విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని మంత్రి బొత్స అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: