తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని మించిపోయాడా.. ఆయనకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారా.. అంటే అవుననే అంటోంది ఓ సర్వే.. కరోనాపై యుద్ధంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి మరి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని, ముఖ్యమంత్రుల పని తీరుపై ఓ టీవీ ఛానల్, మరో సర్వే సంస్థతో కలసి తెలంగాణ ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

 

ఇందులో సీఎం కేసీఆర్ పని తీరు పట్ల ప్రజల్లో సానుకూలత కనిపించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది. కేసీఆర్ పనితీరుపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగితే.. 66.4 శాతం మంది చాలా బాగుందని చెప్పారట. అలాగే.. మరో 27.2 శాతం మంది బాగుందని అన్నారట. ఇంకో 5.8 శాతం మంది పర్లేదు అని అభిప్రాయపడ్డారట. మొత్తం అభిప్రాయాలు సేకరించిన వారిలో కేవలం 0.6 శాతం మంది మాత్రమే బాగాలేదన్నారట .

 

 

అంటే.. మొత్తం మీద కేసీఆర్ పని తీరు బావుంది, సూపర్ అనేవారి సంఖ్య 99 శాతం అన్నమాట. సర్వే చూస్తే కరోనా నివారణకోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఇక ఇదే అంశంపై తెలంగాణ ప్రజలు మోడీ విషయంలో ఏమనుకుంటున్నారని కూడా ఇదే సర్వే ప్రజలను ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు 60.1 శాతం మంది మోడీ పనితీరు చాలా బాగుందంటూ కితాబిచ్చారు. కరోనాను ఎదుర్కునేందుకు మోదీ సర్కార్ తీసుకున్న చర్యలను సమర్థించారు. మరో 24.6 శాతం మంది బాగుంది అన్నారు. ఇంకో 11.9 శాతం మంది పర్లేదు అన్నారు.

 

 

3.4 శాతం మంది మాత్రం మోడీ పని తీరు బాగా లేదన్నారు. అంటే.. 96 శాతం మంది మోడీ పని తీరు ను మెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ విషయంలో ఇది 99 శాతంగా ఉంది. అంటే ప్రధాని మోడీని తెలంగాణ సీఎం దాటేశాడనే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: