దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా గత నాలుగు రోజులనుండి భారీగా కేసులు నమోదవుతుండగా నిన్న కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. నిన్న ఒక్క రోజే  దేశ వ్యాప్తంగా 2850 కేసులు నమోదయ్యాయని సమాచారం. అంతేకాదు  సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.. వీటిలో ఎక్కువగా  మహారాష్ట్ర లో 771 ,తమిళనాడులో 527, ఢిల్లీలో 349, గుజరాత్ లో 376,పంజాబ్ లో 132 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర ,ఢిల్లీలో కేసుల తీవ్రత ఎక్కువగా వున్నా నిన్న మద్యం షాపులు తెరుచుకున్నాయి.
 
ఇక ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 43000 దాటింది అందులో 1400కుపైగా బాధితులు మరణించారు. కాగా 12000మంది కరోనా నుండి కోలుకున్నారు. మరో వైపు ఈనెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది అప్పటివరకు కూడా కరోనా ప్రభావం తగ్గకపోతే మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడం తప్పదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక మూడో దశ లాక్ డౌన్ లో కేంద్రం గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో సడలింపులు ప్రకటించినా కేరళ,జార్ఖండ్ తదితర రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదు.
 
అయితే గత రెండు రోజులనుండి అటు కేరళ లో అలాగే జార్ఖండ్ లో జీరో కరోనా కేసులు నమోదయ్యాయి దాంతో  మరికొన్ని రోజులు పూర్తి లాక్ డౌన్ ను కొనసాగిస్తే మేలని ఆరాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  కేసుల తీవ్రత వున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ విషయంలో కేంద్రం  ఇచ్చిన సడలింపులు అమలవుతున్నాయి. అయితే తెలంగాణ లో మాత్రం మినహాయింపుల విషయంలో ఈ రోజు క్లారిటీ రానుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: